Breaking News

సినిమా ప్రదర్శనలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Published on Sat, 03/01/2025 - 11:32

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో సినిమా ప్రదర్శనలకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమాలకు బెనిఫిట్‌ షో, ప్రిమియర్‌ షో, స్పెషల్ షోలకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. ఈ మేరకు జనవరి 21వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సవరించింది. ఇదే సమయంలో 16 సంవత్సరాల లోపు పిల్లల్ని అన్నీ షోలకు అనుమతించాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అనంతరం, తదుపరి విచారణ మార్చి 17వ తేదీకి వాయిదా వేసింది. 

ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ నటించిన పుష్ఫ-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన పరిణామాలతో ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. కానీ, రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పిటిషనర్ మూవీ టికెట్ రేట్ల పెంపు విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ప్రభుత్వ న్యాయవాది.. సినిమాకి టికెట్ల ధరలను పెంచుతూ ఇచ్చిన అనుమతులను రద్దు చేసినట్లు కోర్టుకు తెలిపారు.

ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఉదయం 8.40 గంటల మధ్య సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ఎలాంటి షోలకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బెనిఫిట్, ప్రత్యేక షోలకు అనుమతించొద్దని హైకోర్టు సూచించింది. నిర్మాత భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవడం సరైంది కాదని వ్యాఖ్యానించింది. ఈ విషయంపై తదుపరి విచారణను వాయిదా వేసింది.



 

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)