Breaking News

Vyuham: లోకేష్‌ న్యాయవాదులపై హైకోర్టు ఆగ్రహం

Published on Thu, 02/01/2024 - 17:31

సాక్షి, హైదరాబాద్‌: వ్యూహం సినిమా విడుదల విషయంలో నారా లోకేష్‌కు ఎదురుదెబ్బ తప్పదా?. తాజాగా ఆయన వేసిన పిటిషన్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం ఇందుకు నిదర్శనం. వ్యూహం సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. పూర్తి సమాచారం లేకుండా వాదనలా? అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ తరఫున పిటిషన్‌ వేసేందుకు లోకేశ్‌కు ఏం అర్హత ఉందంటూ కోర్టు ప్రశ్నించింది.

‘‘ఉపన్యాసాలు, ఉపోద్ఘాతాలు వద్దు.. సబ్జెక్ట్‌పై వాస్తవాలు చెప్పండి. ఇంకా సమయం కావాలని కోరడం.. కోర్టు సమయాన్ని వృథా చేయడమే అంటూ లోకేష్ న్యాయవాదులపై తెలంగాణ హైకోర్టు సీరియస్‌ అయ్యింది. ‘వ్యూహం’పై వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వ్‌ చేసింది.

కాగా, టాలీవుడ్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ తీసిన 'వ్యూహం' సినిమా డిసెంబర్‌ 29వ తేదీనే థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ సినిమాను విడుదల కాకుండా ఉండేందుకు నారా లోకేష్‌ కోర్టు మెట్లు ఎక్కారు. తెలంగాణ  కోర్టు సూచనమేరకు వ్యూహం సినిమాకు తాత్కాలిక బ్రేకులు పడ్డాయి. వ్యూహం సినిమాను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌, జనసేన, టీడీపీ శ్రేణులు, నారా లోకేష్‌, గంటా శ్రీనివాస్‌, ఎల్లో మీడియా ఇలా ఎందరో వర్మ 'వ్యూహం' సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి.

మొదట సినిమాను అడ్డుకునేందుకు సెన్సార్‌ బోర్డుకు నారా లోకేష్‌ ఫిర్యాదు చేశారు. అప్పుడు  CBFC కూడా సినిమాను మళ్లీ రివ్యూ చేసి 'యూ' సర్టిఫికెట్‌ ఇచ్చింది. దీంతో వర్మ దెబ్బకు బయపడిపోయిన లోకేష్‌ కోర్టుకు వెళ్లాడు.. సినిమా వస్తే ఇంతకాలం బయటకు తెలియని ఎన్నో విషయాలు ప్రపంచానికి తెలుస్తాయనే భయంతో ఆయన కోర్టు మెట్లు ఎక్కాడు.

ఇదీ చదవండి: 'ఇంద్రబాబు' పాత్రకు మించి వర్మ 'వ్యూహం'లో ఏముంది..?

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)