Breaking News

చెన్నమనేని జర్మనీ పౌరుడే

Published on Tue, 12/10/2024 - 00:55

సాక్షి, హైదరాబాద్‌: వేములవాడ మాజీ ఎమ్మెల్యే చె న్నమనేని రమేశ్‌ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చిచెప్పింది. భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ 2019లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను సమర్థించింది. తప్పుడు పత్రాలతో గత 15 ఏళ్లుగా న్యాయస్థానాన్ని, అధికారులను తప్పుదోవ పట్టించారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్మనీ పౌరుడినని తెలిసినా పలు పిటిషన్లు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేశారని మండిపడింది.

ఇందుకుగాను ఆయనకు హైకోర్టు చరిత్రలోనే తొలి సారిగా ఏకంగా రూ. 30 లక్షల భారీ జరిమానా విధించింది. ఇందులో ఆది శ్రీనివాస్‌ (ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో రమేశ్‌ ప్రత్యర్థి)కు రూ. 25 లక్షలు, హైకోర్టు లీగల్‌ సర్విసెస్‌ కమిటీకి రూ. 5 లక్షలు చెల్లించాలని రమేశ్‌ను ఆదేశించింది. చెల్లింపునకు నెల రోజులు గడువు విధించింది. 2009లో తొలిసారి వేములవాడ నుంచి ఎ మ్మెల్యేగా విజయం సాధించింది మొదలు చెన్నమ నేని భారతీయ పౌరుడా కాదా అనే వివాదం కొన సాగుతోంది.

ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్‌ దీనిపై తొలి నుంచీ న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జర్మనీ పౌరసత్వం కారణంగా రమేశ్‌ భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ 2019 నవంబర్‌లో నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ అదే సంవత్సరం ఆయన హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై ఐదేళ్లపాటు సాగిన విచారణ అనంతరం న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి అక్టోబర్‌లో తీర్పు రిజర్వు చేసి సోమవారం తీర్పు వెలువరించారు.  

ఆయన ఎన్నిక కూడా చెల్లదన్న ఆది శ్రీనివాస్‌ 
చెన్నమనేని ఇరుదేశాల పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌ వాదించారు. ‘రెండుచోట్ల వివిధ కేటగిరీల కింద పౌరసత్వం కలిగి ఉండటాన్ని మన చట్టాలు అనుమతించవు. విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయుడు ఎన్నటికీ ఇక్కడ ఎమ్మెల్యే కాలేరు. తన పౌరసత్వ సమస్య 2009 నుంచి పెండింగ్‌లో ఉన్నా చెన్నమనేని రమేశ్‌ రెండు పౌరసత్వాలలో ఒకదాన్ని వదులుకోలేదు’అని వారు గుర్తుచేశారు.

చెన్నమనేని రమేశ్‌ క్లెయిమ్‌ చేస్తున్న రెండు విభిన్న రకాల పౌరసత్వాలకు సంబంధించిన ఆధారాలు, పత్రాలను న్యాయమూర్తికి సమరి్పంచారు. రమేశ్‌ పౌరసత్వాన్ని కొనసాగించడం ‘ప్రజాప్రయోజనాలకు అనుకూలం కాదు’అని కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరించారు. మరోవైపు ఆది శ్రీనివాస్‌ తరఫు న్యాయవాది రవికిరణ్‌రావు వాదిస్తూ ‘ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా కార్డుతో చెన్నమనేని రమేశ్‌ జర్మనీకి అనేకసార్లు వెళ్లారు.  జర్మనీ పౌరసత్వంతోనే ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నిక కూడా చెల్లదు’అని పేర్కొన్నారు. 

ఆ అధికారం కేంద్రానికి లేదని వాదించిన రమేశ్‌ 
మరోవైపు చెన్నమనేని రమేశ్‌ తరఫున న్యాయవాది రామారావు వాదిస్తూ ‘చెన్నమనేని జర్మనీ పౌరసత్వాన్ని వదులుకున్నారు. జర్మనీ పాస్‌పోర్టుతో ప్రయాణించినంత మాత్రాన ఆ దేశ పౌరసత్వం ఉన్నట్లు కాదు. దేశ సార్వ¿ౌమత్వానికి విఘాతం కలిగించిన వారి పౌరసత్వాన్ని రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉంది. కానీ రమేశ్‌ అలాంటి చర్యలకు పాల్పడలేదు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకోవాలి. చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వ రద్దు నోటిఫికేషన్‌ను కొట్టేయాలి’అని కోరారు.

అప్పీల్‌కు వెళ్లడాన్ని పరిశీలిస్తా: చెన్నమనేని
హైకోర్టు తీర్పు తీవ్ర నిరాశపరిచిందని చెన్నమనే ని రమేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సో మవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రా జకీయ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మిత్రు­లు, శ్రేయోభిలాషుల సహకారంతో ముందుకు నడిచానని.. నాలుగుసార్లు ఎన్నికల్లో గెలిచానని గుర్తుచేశారు. వరుస ఓటములను జీర్ణించుకోలేక రాజకీ­య ప్రత్యర్థులు తన పౌరసత్వంపై కేసులు వే­శారని చెన్నమనేని ఆరోపించారు. ఇలాంటి కేసులను గతంలోనే హైకోర్టు, సుప్రీంకోర్టులో విజయవంతంగా ఎదుర్కొన్నానని.. తాజా తీర్పుపై అప్పీల్‌ చేసే అంశాన్ని పరిశీలిస్తానన్నారు. ప్రత్యక్ష రాజకీయా­లకు దూరంగా ఉన్నప్పటికీ వేములవాడ అభివృద్ధికి సహకరిస్తూనే ఉంటానని పేర్కొన్నారు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)