Breaking News

TG: మీ ఇష్టానుసారం ప్రవర్తిస్తామంటే కుదరదు

Published on Thu, 02/20/2025 - 16:31

హైదరాబాద్‌, సాక్షి: మహానగరంలో విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ ప్రొటెక్షన్‌(హైడ్రా)పై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. ఇష్టానుసారం కూల్చివేతలు చేపడతారా? అంటూ మండిపడింది. ఈ క్రమంలో తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

హైడ్రా కూల్చివేతల వ్యవహారంపై (HYDRAA Demolitions)పై దాఖలైన పిటిషన్‌పై గురువారం విచారణ సందర్భంగా జస్టిస్‌ కే.లక్ష్మణ్‌ తీవ్రంగా స్పందించారు. ‘‘మీ ఇష్టం వచ్చినట్లు కూల్చివేతలు చేపడతారా? సెలవు దినాల్లో కూల్చివేతలు చట్టవిరుద్ధమని చెప్పినా నిబంధనలు పాటించరా? న్యాయస్థానం ఆదేశాలంటే లెక్కలేకుండా వ్యవహరిస్తే.. అది తెలిసేలా చేస్తాం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.  

గత విచారణ సందర్భంగా ఇచ్చిన ఆదేశాలతో హై కోర్టుకు హాజరైన హైడ్రా ఇన్స్‌పెక్టర్‌ రాజశేఖర్‌(HYDRAA Inspector Rajasekar) పైనా ధర్మాసనం మండిపడింది.   పోలీస్‌ శాఖను నుంచి డిప్యూటేషన్‌పై వచ్చినంత మాత్రాన అక్కడ వ్యవహరించినట్లు ఇక్కడ ఉంటామంటే కుదరదు అని మందలించారు.  మరోసారి ఇలాగే జరిగితే మీపై చర్యలకు డీజీపీకి ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఆక్రమణల స్వాధీనానికి, అక్రమ భవనాల కూల్చివేతకు మేం వ్యతిరేకం కాదన్న జస్టిస్‌ కే లక్ష్మణ్‌.. ఏది చేసిన చట్టపరంగా ఉండాలని సూచించారు. అలాగని ఇష్టం వచ్చినట్లు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అనంతరం విచారణను వాయిదా వేశారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)