Breaking News

TS: వానలు మిగిల్చిన విషాదం

Published on Fri, 07/28/2023 - 08:47

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలు విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించినట్లు తెలుస్తోంది. ఒక్క ములుగు జిల్లాలోనే 30 మందికిపైగా వరదల్లో గల్లంతు అయినట్లు సమాచారం. అంతటా గల్లంతైన వాళ్ల కోసం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతున్నాయి. 

ఇదిలా ఉంటే.. జంపన్న వాగు ఉగ్రరూపంతో ఏడుగురు గల్లంతు అయ్యారు. వాగు పోటెత్తి కొండాయి, మల్యాల గ్రామాలను ముంచెత్తింది. ఏడుగురిలో నలుగురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మృతులను మజీద్, షరీఫ్, అజ్జు, గుర్తు తెలియని ఓ మహిళ ఉన్నారు.

ఇక.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొరంచ వాగు ఉధృతితో నిన్న మొరంచపల్లి గ్రామం నీట మునిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉదయం కల్లా వాగు ప్రవాహం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. మరోవైపు పునరావాస కేంద్రాల్లో మొరంచపల్లి గ్రామస్తులు ఉన్నారు. గల్లంతైన నలుగురు గ్రామస్తుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.  భూపాలపల్లి-పరకాల-హన్మకొండ జాతీయ రహదారి మరమతు పనులు చేపట్టారు అధికారులు. మొరంచపల్లి లో వరదలకు 100కు పైగా పశువులు మృతి చెందినట్లు తెలుస్తోంది. 

ములుగు జిల్లా వెంకటాపురం మండలం బూరుగుపేటలో విషాదం చోటుచేసుకుంది. మారేడుగొండ చెరువుకు గండిపడి ముగ్గురు సభ్యులున్న కుటుంబం కొట్టకుపోయింది. అందులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యంకాగా.. మిగతా ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది.

వరద కారణంగా ములుగు-ఏటూరు నాగారం బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

ప్రాణ నష్టం లేకుండా చూడాలంటూ సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌ సైతం తాజాగా అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఇ‍ప్పటికే కురిసన వర్షాలు, వరదలతో..  భూపాలపల్లి, ములుగుతో పాటు ఉమ్మడి వరంగల్‌లోని మహబూబాబాద్‌, అలాగే సిద్ధిపేట, నిజామాబాద్‌, హన్మకొండ, రంగారెడ్డి జిల్లాల్లోనూ మరణాలు సంభవించాయి. వరదల్లో కొట్టుకుపోయి.. గోడలు కూలి.. కరెంట్‌షాక్‌ మరణాలు సంభవించాయి. తెలంగాణ వ్యాప్తంగా అధికారులు 14 మందే చనిపోయారని ప్రకటించినప్పటికీ.. ఆ సంఖ్య ఇంకా ఎక్కువేనని స్పష్టమవుతోంది. 

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)