Breaking News

ఐఏఎస్‌ కేడర్‌లో ఐపీఎస్‌లా?

Published on Tue, 12/02/2025 - 09:41

సాక్షి, హైదరాబాద్‌: శిఖాగోయల్, సీవీ ఆనంద్, స్టీఫెన్‌ రవీంద్ర లాంటి ఐపీఎస్‌ ఆఫీసర్లను ఐఏఎస్‌ కేడర్‌లోకి తీసుకోవడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణ డిసెంబర్‌ 10కి వాయిదా వేసింది. 

కొందరు ఐపీఎస్‌ అధికారులకు ఐఏఎస్‌ హోదా కల్పిస్తూ సెప్టెంబర్ 26న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 1342ను సవాల్‌ చేస్తూ సికింద్రాబాద్‌ తార్నాకకు చెందిన వడ్ల శ్రీకాంత్‌ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సూరేపల్లి నందా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పౌర సరఫరాల కమిషనర్‌గా స్టీఫెన్‌ రవీంద్ర, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా శిఖాగోయల్, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం నియమించడం చట్టవిరుద్ధమన్నారు. 

చట్టాలు, నిబంధనలను ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచి్చన జీఓ చెల్లదని చెప్పారు. రాష్ట్రంలో కీలకమైన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పోలీసులే దర్యాప్తు చేస్తున్నారని, ఆ నివేదిక కూడా హోంశాఖ ముఖ్య కార్యదర్శి (ప్రస్తుతం ఐపీఎస్‌ అధికారి)కే పంపడం సరికాదన్నారు. ఇండియన్‌ అడ్మిని్రస్టేటివ్‌ సరీ్వస్‌ (కేడర్‌) రూల్స్, 1954ను ఉల్లంఘస్తూ ఏకపక్షంగా ఇచి్చన జీఓను కొట్టివేయాలని కోరారు. ప్రభుత్వం తరఫున స్పెషల్‌ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయడానికి సమయం కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు. 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)