‘అనర్హత’ పిటిషన్లపై తీర్పు రిజర్వు

Published on Thu, 08/08/2024 - 01:12

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. రాజ్యాంగపరమైన అంశాల నేపథ్యంలో ఏప్రిల్‌ నుంచి సుదీర్ఘ వాదనలు విన్నది. పిటిషనర్లు, ప్రతివాదుల తరఫున సుప్రీంకోర్టు, హైకోర్టు సీనియర్‌ న్యాయవాదులు పలు తీర్పులను ఉదహరిస్తూ వాదనలు వినిపించారు. బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కేపీ.వివేకానంద హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఖైరతాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన దానం నాగేందర్‌.. ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లోకి చేరారని ఆయనను కూడా అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మరో పిటిషన్‌ వేశారు. నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదు చేసేందుకు ప్రయతి్నంచిన స్పీకర్‌ సమయం ఇవ్వడం లేదంటూ బీజేపీ ఎలీ్పనేత మహేశ్వర్‌రెడ్డి మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మూడు పిటిషన్లపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం మరోసారి విచారణ చేపట్టారు. 

దానం, కడియం తరఫున సీనియర్‌ న్యాయవాదులు శ్రీరఘురాం, మయూర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘సుప్రీంకోర్టు వేర్వేరు తీర్పుల ప్రకారం స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలు జారీ చేసేందుకు వీల్లేదు. స్పీకర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పదిరోజులకే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. స్పీకర్‌కు కనీస గడువు కూడా ఇవ్వకుండానే న్యాయ సమీక్ష కోరడం చెల్లదు. తాజా పిటిషన్లను కొట్టేయాలి.. లేనిపక్షంలో డివిజన్‌ బెంచ్‌కు నివేదించాలి. 

గత శాసనసభ స్పీకర్‌ ఎదుట పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్‌ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌లో స్పీకర్‌కు నిర్దిష్ట గడువు నిర్ణయించేందుకు ఇద్దరు న్యాయమూర్తుల హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది’అని పేర్కొన్నారు. లిఖితపూర్వక వాదనలను శుక్రవారం సమర్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వాదనలు పూర్తి కావడంతో న్యాయమూర్తి.. తీర్పు రిజర్వు చేశారు.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)