Breaking News

మిస్‌ వరల్డ్‌లో మన హస్తకళలు!

Published on Mon, 05/05/2025 - 06:04

సాక్షి, హైదరాబాద్‌: నిత్యం ఫ్యాషన్‌ ప్రపంచంలో మునిగితేలే సుందరీమణులు నిర్మల్‌ కొయ్య బొమ్మలను చెక్కనున్నారు.. పోచంపల్లి చీరల తయారీకి పోగులు సిద్ధం చేయబోతున్నారు. చేర్యాల పెయింటింగ్స్‌కు రంగులద్దనున్నారు.. ఇలా ఒకటేమిటి తెలంగాణ సంప్రదాయ హస్తకళలకు సంబంధించి కాసేపు ‘కళాకారులు’కాబోతున్నారు. పోటీలో భాగంగా తెలంగాణ హస్తకళలపై ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబోతున్నారు. ‘ప్రపంచ సుందరి’ 72వ ఎడిషన్‌ పోటీలకు వేదికైన హైదరాబాద్‌ కొత్త ‘అందం’తో తళుకులీనుతోంది. 

ఇప్పటికే కొన్ని దేశాలకు చెందిన పోటీదారులు నగరానికి చేరుకోగా, మరికొందరు సోమ, మంగళవారాల్లో వస్తున్నారు. వీరి రాకకు దాదాపు వారం ముందే మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ సీఈఓ, చైర్‌పర్సన్‌ జూలియా మోర్లే తన సిబ్బందితో నగరానికి చేరుకున్నారు. హైటెక్‌సిటీ సమీపంలోని ట్రైడెంట్‌ స్టార్‌ హోటల్‌లో ఆమె తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పోటీల నిర్వహణ పూర్తిగా మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ కనుసన్నల్లోనే జరగనుంది. పోటీల షెడ్యూల్, ఇతివృత్తాలను ఆ సంస్థే నిర్ణయించింది. 

రాష్ట్రప్రభుత్వ సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని డిజైన్‌ చేసింది. ఇదే సందర్భంలో జూలియా మోర్లే రాష్ట్రప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేసింది. తెలంగాణ సంప్రదాయ హస్తకళలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయని, వాటిని పోటీల్లో భాగంగా చేర్చాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆయా హస్తకళలపై పోటీదారులకు అవగాహన కల్పించాలని కోరారు. దీంతో రాష్ట్రప్రభుత్వం శిల్పారామంలో ప్రత్యేకంగా వారికి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. 

22 రకాల హస్తకళల లైవ్‌ డెమానిస్ట్రేషన్‌ ఇక్కడ ఉండనుంది. ఈ నెల 21న వివిధ దేశాల పోటీదారులు అక్కడికి రానున్నారు. వారి ముందే నిపుణులైన కళాకారులు ఆయా కళాకృతులను తీర్చిదిద్ది, వాటి ప్రత్యేకతలను వివరించనున్నారు. వాటి తయారీలో పోటీదారులు కూడా స్వయంగా పాల్గొంటారు. శిల్పారామం ప్రత్యేకాధికారి కిషన్‌రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉంటుంది.  

స్టాళ్లు చూసి ఆసక్తి..
మార్చి 20న మిస్‌ వరల్డ్‌ పోటీల వివరాలను తొలిసారి జూలియా మోర్లే పర్యాటక భవన్‌లో మీడియాకు వెల్లడించారు. మిస్‌ వరల్డ్‌–2024 విజేత, చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టీనీ పిజ్కోవా కూడీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి స్వాగతం పలికేందుకు తెలంగాణ హస్తకళలను స్వయంగా రూపొందిస్తూ కళాకారులతో స్టాళ్లు ఏర్పాటు చేశారు. వాటిని జూలియా, క్రిస్టీనీ ఎంతో ఆసక్తిగా తిలకించారు. క్రిస్టీనా పిజ్కోవా అయితే కాసేపు మగ్గం మీద కూర్చుని పోచంపల్లి చీర అల్లికను పరిశీలించారు. 

అప్పుడే వీటిపై మిస్‌వరల్డ్‌ సీఈఓకు ప్రత్యేకాసక్తి కలిగిందని సమాచారం. ఆమె సూచనతో అధికారులు ప్రత్యేకంగా వాటి లైవ్‌ డెమానిస్ట్రేషన్‌కు ఏర్పాట్లు చేశారు. చేర్యాల స్క్రోల్‌ పెయింటింగ్స్, నిర్మల్‌ చిత్రకళ, నిర్మల్‌ కొయ్య బొమ్మలు, బిద్రి వేర్, బంజారా ఎంబ్రాయిడరీ, పోచంపల్లి, కొత్తకోట, నారాయణపేట, గద్వాల హ్యాండ్‌లూమ్స్, పెంబర్తి ఇత్తడి బొమ్మలు, సిల్వర్‌ ఫిలిగ్రీ, సిద్ది పేట గొల్లభామ చీరలు, నకాషీ, మట్టికుండల తయారీ, కళంకారీ.. ఇలా పలు కళలకు సంబంధించిన ఏర్పాట్లు చేయటం విశేషం.   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)