Telangana: రోజుకు 10 గంటలు పనిచేయొచ్చు!

Published on Sun, 07/06/2025 - 08:55

సాక్షి, హైదరాబాద్‌: సులభతర వాణిజ్య విధానం కోసం వాణి జ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పనివేళల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై వాణిజ్య సంస్థల్లో (దుకాణాలు మినహా) పనిచేసే ఒక ఉద్యోగి రోజుకు పది గంటల వరకు విధులు నిర్వర్తించే అవకాశం కల్పించింది. 

అయితే వారంలో 48 గంటలకు మించి పనిచేయకూడదనే నిబంధన విధించింది. రోజుకు 10 గంటల పనికి అవకాశం ఇచ్చినా, ఆరుగంటల తర్వాత అరగంట పాటు విశ్రాంతి ఇవ్వాలి. ఓవర్‌ టైమ్‌ పనిచేసే ఉద్యోగి ప్రత్యేక సందర్భాల్లో ఆరుగంటలకు మించి పనిచేయొద్దు. ఈ లెక్కన ప్రత్యేక సందర్భాల్లో ఒకరోజుకు గరిష్టంగా 12 గంటలు దాటి పనిచేసే అవకాశం లేదు. 

వారంలో 48 గంటల కంటే అధిక గంటలు పనిచేసినప్పుడు.. అందుకు తగిన అదనపు భత్యం చెల్లిస్తూనే.. ఒక త్రైమాసికంలో 144 పనిగంటలు దాటకూడదు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు అతిక్రమిస్తే సదరు వాణిజ్య సంస్థకు ప్రభుత్వం నుంచి అందుతున్న మినహాయింపులు, రాయితీలను ఎలాంటి నోటీసు లేకుండానే రద్దు చేస్తుంది. ఈ మేరకు రాష్ట్ర కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్‌ శనివారం నోటిఫికేషన్‌ జారీ చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)