Breaking News

ఇద్దరు ఐపీఎస్‌లను రిలీవ్‌ చేస్తూ ఉత్తర్వులు

Published on Sun, 02/23/2025 - 05:48

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ నుంచి హోం కేడర్‌ ఏపీకి బదిలీ అయిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు అంజనీకుమార్, అభిలాష బిస్త్‌లను రిలీవ్‌ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల మేరకు ఇద్దరు అధికారులను రిలీవ్‌ చేసినట్టు సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్‌కు సూచించారు.

1990 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి అంజనీకుమార్‌ ప్రస్తుతం తెలంగాణ రోడ్డు సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా, 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి అభిలాష బిస్త్‌ తెలంగాణ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితోపాటు ఏపీ హోం కేడర్‌కు వెళ్లాల్సిందిగా కేంద్ర హోంశాఖ సూచించిన కరీంనగర్‌ సీపీ అభిషేక్‌ మహంతిని మాత్రం ఇంకా రిలీవ్‌ చేయలేదు. కరీంనగర్‌ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషన్‌ నుంచి అనుమతి వచ్చిన తర్వాత రిలీవ్‌ చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)