Breaking News

మూసీ నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు.. ఉత్తర్వులు జారీ

Published on Tue, 09/24/2024 - 20:47

సాక్షి, హైదరాబాద్‌: మూసీ నది అభివృద్ధి  ప్రాజెక్టులో నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్  అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే  కుటుంబాలకు 16 వేల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కేటాయిస్తూ ఈ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా మూసీ నదిని ప్రక్షాళన చేసి.. దానిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మూసీ పరిసరాల్లో నివసిస్తున్న కుటుంబాలను తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16 వేల డబుల్‌ బెడ్‌ రూం గృహాలను ఇవ్వనుంది ప్రభుత్వం.
చదవండి: ఓటుకు నోటు కేసు.. విచారణకు రావాలని సీఎం రేవంత్‌కు కోర్టు ఆదేశం

మూసీలో మొత్తం 10,200 మందిని నిర్వాసితులుగా ప్రభుత్వం గుర్తించింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మూడు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు రేపు ఇంటింటికి వెళ్లి అక్కడున్న ప్రజలకు ఎక్కడెక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించారో తెలియజేయనున్నారు.

మరోవైపు రివర్ బెడ్‌లో  ఆక్రమణలో ఉన్న 1600 ఇళ్లను తొలగించి.. అక్కడ ఉన్న వారిని తరలించనుంది ప్రభుత్వం. మూసీ బఫర్ జోన్‌లో  నివసించే వ్యక్తులు, నిర్మాణాలకు RFCTLARR చట్టం ప్రకారం పరిహారం చెల్లించనుంది. నిర్మాణ ఖర్చుతో పాటు, పట్టా ఉంటే భూమి విలువను పరిహారంగా చెల్లించనుంది.  వీటితోపాటు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కూడా కేటాయించనుంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)