Breaking News

వచ్చే ఐదేళ్ల లక్ష్యంపై గవర్నర్ ప్రసంగం తయారీ!

Published on Fri, 12/15/2023 - 03:52

రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో ఏమేం చేయనుంది, ఎలాంటి లక్ష్యాలను పెట్టుకుందనే అంశాలతో శుక్రవారం అసెంబ్లీ ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్‌ ప్రసంగం ఉండనుంది. ఇదే సమయంలో గత ప్రభుత్వ తప్పిదాలు, పథకాల అమల్లో లోపాలను ప్రస్తావించనుంది. ఈ మేరకు గవర్నర్‌ ప్రసంగ పాఠానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. గురువారం రాష్ట్ర శాసనసభ వాయిదా పడ్డాక అసెంబ్లీ ఆవరణలోనే కేబినెట్‌ భేటీ జరిగింది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం     

భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. గంటన్నరకుపైగా సాగిన ఈ సమావేశంలో గవర్నర్‌ ప్రసంగ పాఠంతోపాటు పలు ఇతర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గవర్నర్‌ తొలిసారిగా ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడనుండటంతో.. ప్రసంగ పాఠంలో ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనేదానిపై మంత్రివర్గం కసరత్తు చేసింది. పాలన, ఆర్థిక అంశాల్లో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, వచ్చే ఐదేళ్లపాటు కొత్త ప్రభుత్వం అనుసరించే విధానాలను గవర్నర్‌ ప్రసంగం ద్వారా వివరించాలని నిర్ణయించింది.

గత ప్రభుత్వ విధానాలపై సమీక్ష.. 
ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ విభాగాల పనితీరు, ప్రభుత్వ పథకాల అమలులో లోపాలను గవర్నర్‌ ప్రసంగంలో ప్రస్తావించాలని కేబినెట్‌ నిర్ణయించింది. మరోవైపు విద్యుత్, వ్యవసాయం, నీటిపారుదల, విద్య, వైద్యారోగ్యం, సంక్షేమ రంగాల్లో తాము అనుసరించే విధానాలను ప్రకటించాలని తీర్మానించింది. ఎన్నికల్లో ఇచి్చన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటి అమలును పాక్షికంగా ప్రారంభించిన అంశాన్ని వివరిస్తూ.. ఇతర గ్యారంటీల అమలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తామనే దానిపై స్పష్టత ఇవ్వాలని నిర్ణయించింది. బీఆర్‌ఎస్‌ సర్కారు రాష్ట్రాన్ని అవినీతి, అప్పుల్లో ముంచిందని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ విస్తృతంగా ప్రచారం చేసిన నేపథ్యంలో.. గవర్నర్‌ ప్రసంగంలో, తర్వాత ధన్యవాద తీర్మానంపై జరిగే చర్చలో ఆయా అంశాలను ప్రస్తావించాలని కేబినెట్‌ భేటీలో నిర్ణయానికి వచ్చారు. ఇక రైతుబంధు, ధరణి పోర్టల్, సామాజిక పింఛన్ల పెంపు వంటి అంశాలపై త్వరలో మరోమారు సమావేశం అవుతామని మంత్రులకు సీఎం రేవంత్‌ చెప్పినట్టు సమాచారం. 

విభాగాల వారీగా శ్వేతపత్రాలు 
వివిధ ప్రభుత్వ శాఖల వారీగా అప్పులు, పనులు, పథకాల తీరుతెన్నులను వివరిస్తూ శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్‌ భేటీలో నిర్ణయించారు. శ్వేతపత్రాల విడుదల మొక్కుబడిగా, హడావుడిగా కాకుండా పూర్తి వివరాలు, ఆధారాలతో ఉండాలని.. ఆ దిశగా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కసరత్తు చేయాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. మంత్రులు కూడా తమకు అప్పగించిన శాఖల్లో లోతుగా సమీక్షించి, అవగాహన పెంచుకోవాలని సూచించారు. శ్వేతపత్రాల విడుదల తర్వాత బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చే ప్రతిస్పందనకు దీటుగా సమాధానాలు ఇచ్చేలా మంత్రులు సన్నద్ధం కావాలని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై వచ్చే విమర్శలు, ఆరోపణలపై తొందరపాటుతో స్పందించకుండా.. లోతుగా అవగాహన చేసుకున్నాకే ప్రతిస్పందించాలని సీఎం సూచించినట్టు తెలిసింది. ఉభయ సభల భేటీలో గవర్నర్‌ ప్రసంగం అనంతరం ధన్యవాద తీర్మానంపై జరిగే చర్చలో.. సీఎం రేవంత్‌తోపాటు ట్రెజరీ బెంచ్‌ (అధికార పక్షం)నుంచి మాట్లాడాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినందున పూర్తి సన్నద్ధతతో రావాలని పేర్కొన్నట్టు సమాచారం.   
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)