Breaking News

ఫార్ములా–ఈ కేసులో కేటీఆర్‌కు త్వరలో నోటీసులు!

Published on Sat, 12/14/2024 - 04:17

సాక్షి, హైదరాబాద్‌: ఫార్ములా–ఈ రేస్‌ కోసం విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా రూ.46 కోట్లు బదలాయించారన్న కేసు దర్యాప్తులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు త్వరలో నోటీసులు జారీ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకోసం గవర్నర్‌ నుంచి అనుమతి లభించినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌పై కేసు నమోదుకు ప్రభుత్వం అనుమతివ్వడం తెలిసిందే. 

హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ–రేస్‌ కోసం విదేశీ సంస్థకు హెచ్‌ఎండీఏ నుంచి బోర్డు అనుమతి లేకుండానే రూ.46 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడం నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో పురపాలక శాఖ ఈ అంశంలో ఏసీబీ దర్యాప్తు చేయించాలని ప్రభుత్వానికి లేఖ రాయడం, దానిని ఏసీబీకి అప్పగించడం తెలిసిందే. నాడు కేటీఆర్‌ ఆదేశాల మేరకే తాను ఆ నిధులు చెల్లించానని అప్పుడు హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా ఉన్న అర్వింద్‌కుమార్‌ ప్రభుత్వానికి ఇదివరకే స్పష్టం చేశారు. కేటీఆర్‌పై కేసు నమోదు చేసి, విచారణ చేయాలంటే గవర్నర్‌ అనుమతి తప్పనిసరి కావడంతో గత నెలలో ప్రభుత్వం అనుమతి కోరింది. దీనిపై న్యాయ సలహా తీసుకున్న గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ.. కేసు నమోదుచేసి విచారణ జరిపేందుకు అనుమతిచి్చనట్లు తెలిసింది. 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)