Breaking News

కేటీఆర్‌పై విచారణకు గవర్నర్‌ అనుమతి

Published on Thu, 11/20/2025 - 10:29

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. కేటీఆర్‌పై విచారణకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అనుమతి ఇచ్చారు. దీంతో, ఈ-కారు రేసు కేసులో కేటీఆర్‌పై ఛార్జ్‌షీట్‌ వేసేందుకు  ఏసీబీకి గవర్నర్‌ అనుమతి లభించినట్టు అయ్యింది. అయితే, కేటీఆర్‌పై విచారణకు గవర్నర్‌ అనుమతి కోరుతూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో తాజాగా గవర్నర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. 

కాగా, ఫార్ములా ఈ-కారు రేసులో క్విడ్‌ ప్రోకో జరిగినట్టు ఏసీబీ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. రూ.54.88 కోట్ల నిధులు దారి మళ్లింపుపై ఆరోపణలు చేసింది. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్‌ ఇప్పటికే పలుమార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. రెండు సార్లు ఏసీబీ విచారణకు, ఒకసారి ఈడీ విచారణకు కేటీఆర్‌ హాజరయ్యారు. ఇక, ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌ వ్యవహారంపై 2024 డిసెంబరు 18న ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్‌, ఏ2గా ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిపై కేసు నమోదైంది. 

ఇక, తాజా పరిణామంతో త్వరలోనే కేటీఆర్‌పై అభియోగాలు నమోదు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. విచారణ తర్వాతే ఛార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా, అటు కేసులో కీలక నిందితులైన ఐఏఎస్ అరవింద్ కుమార్‌పై డోపీటీ (DOPT)కి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఒకవేళ కేంద్రం అనుమతి ఇస్తే ఆయనపై కూడా ఏసీబీ అభియోగాలు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉంది.

ఫార్ములా ఈ కారు రేసు టైమ్‌లైన్‌..

  • డిసెంబరు 18, 2024న ఎఫ్‌ఐఆర్‌ నమోదు
  • డిసెంబర్‌ 28, 2024 ఈడీ సమన్లు.
  • జనవరి 2, 2025న అర్వింద్‌ కుమార్‌ విచారణ.
  • జనవరి 3, 2025న బీఎల్‌ఎన్‌ రెడ్డి విచారణ.
  • జనవరి 7, 2025న కేటీఆర్‌ విచారణ.
  • జూన్‌ 2025లో ఏసీబీ రెండో దశ విచారణ.
  • జూన్‌ 16న కేటీఆర్‌ మరోసారి విచారణకు హాజరు. 

     
     

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)