Breaking News

మున్సిపాలిటీలకు రూ.2,780 కోట్లు

Published on Sat, 10/25/2025 - 03:53

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మున్సిపాలిటీ ల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభు త్వం భారీగా నిధులు విడుదల చేసింది. ఒకే సారి రూ. 2,780 కోట్లు విడుదల చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిధులను తెలంగాణ కోర్‌ అర్బన్‌ సిటీ మినహాయించి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 138 మున్సిపాలిటీలు, కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్లలో ఖర్చు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కొత్త మున్సిపాలిటీలు, కొత్త గ్రామాలు విలీనమైన మున్సిపాలిటీల్లో పనులకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.

మున్సిపాలిటీలకు ఒక్కోదానికి రూ.15 కోట్లు, కొత్త కార్పొరేషన్లకు రూ.30 కోట్లు, గ్రామాలను విలీనం చేసిన మున్సిపాలిటీలకు రూ.20 కోట్ల చొప్పున వెంటనే పంపిణీ చేయాలని తెలిపారు. ఈ రూ.2,780 కోట్లతో చేపట్టే మొత్తం 2,432 పనులకు సీఎం ఆమోద ముద్ర వేశారు. ఈ పనులకు వెంటనే టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టాలని, వచ్చే ఏడాది మార్చి నాటికి కచి్చతంగా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

పురపాలక శాఖ కూడా ముఖ్యమంత్రి వద్దే ఉన్న విషయం తెలిసిందే. పంచాయతీరాజ్‌ స్థానిక సంస్థలకు ఎన్నికలు ముగిసిన వెంటనే పురపాలక ఎన్నికలు కూడా నిర్వహించనున్న నేపథ్యంలో భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిని తెలంగాణ కోర్‌ అర్బన్‌ ఏరియాగా పరిగణిస్తున్న నేపథ్యంలో.. జీహెచ్‌ఎంసీ, చుట్టుపక్కల వాటికి మినహా అన్నింటికి ఈ నిధులు వెంటనే విడుదల చేయాలని సీఎం ఆదేశించారు.  

ప్రాధాన్యతా క్రమంలో పనులు..  
ఇప్పటికే ఉన్న మున్సిపాలిటీల విస్తరణతోపాటు కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలన్నింటిలో అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం సూచించారు. రాష్ట్ర బడ్జెట్‌లో పొందుపరిచిన నగరాభివృద్ధి నిధులతోపాటు పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (UIDF) నుంచి ఈ నిధులను మంజూరు చేశారు. ప్రాధాన్యత క్రమంలో ఈ నిధులను ఖర్చు చేసేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని మున్సిపల్‌ శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. మున్సిపాలిటీల్లో విలీనమైన ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం, వర్షపు నీరు, మురుగు నీటికి డ్రైన్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, చెరువులు, కుంటల్లో కాలుష్య నివారణ, డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మించిన ప్రాంతాల్లో ప్రాథమిక సదుపాయాల ఏర్పాటు, పార్కుల అభివృద్ధి, కల్వర్టులు, షాపింగ్‌ కాంప్లెక్సుల నిర్మాణ పనులకు ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)