Breaking News

ఏ మున్సిపాలిటీ.. ఏ జోన్‌లోకి?

Published on Sun, 11/30/2025 - 08:24

సాక్షి, హైదరాబాద్‌: నగర శివార్లలోని 20 పురపాలికలు, ఏడు నగరపాలక సంస్థలు జీహెచ్‌ఎంసీలో విలీనమవుతుండటంతో సదరు మున్సిపల్‌ కార్యాలయాలిక జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయాలుగా రూపాంతరం చెందనున్నాయి. అక్కడి పురపాలక కమిషనర్లు.. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. సదరు కార్యాలయా లు జీహెచ్‌ఎంసీ పరిధిలోకి రానున్నాయి. ఆర్డినెన్స్, జీవోల ద్వారా ప్రభుత్వం విలీనం ప్రకటించగానే  పురపాలికలు సర్కిళ్లుగా మారి దగ్గర్లోని సంబంధిత జోన్ల (కార్యాలయాల) పరిధిలోకి రానున్నాయి.

ఆయా పుర/నగర పాలక సంస్థలు.. జీహెచ్‌ఎంసీ సర్కిళ్లుగా దిగువ జోన్ల పరిధిలోకి రానున్నాయి. 
ఎల్‌బీనగర్‌ జోన్‌: ఆదిబట్ల, మీర్‌పేట్, బడంగ్‌పేట, తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట్, పీర్జాదిగూడ, పోచారం, ఘట్‌కేసర్, బోడుప్పల్‌. (ప్రస్తుతమున్న సర్కిళ్లు: కాప్రా, ఉప్పల్, హయత్‌నగర్, ఎల్‌బీనగర్, సరూర్‌నగర్‌) 

సికింద్రాబాద్‌ జోన్‌: తూంకుంట, నాగారం, దమ్మాయిగూడ, జవహర్‌నగర్‌. (ప్రస్తుతమున్న సర్కిళ్లు: ముషీరాబాద్, అంబర్‌పేట్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, బేగంపేట) 

కూకట్‌పల్లి జోన్‌: కొంపల్లి, గుండ్ల పోచంపల్లి, మేడ్చల్, దుండిగల్, నిజాంపేట్, బొల్లారం. (ప్రస్తుతమున్న సర్కిళ్లు: మూసాపేట్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, గాజుల రామారం, అల్వాల్‌) 

చార్మినార్‌ జోన్‌: బండ్లగూడ జాగీర్, శంషాబాద్, జల్‌పల్లి, తుక్కుగూడ. (ప్రస్తుతమున్న సర్కిళ్లు: మలక్‌పేట్, సంతోష్‌నగర్, చాంద్రాయణగుట్ట, చారి్మనార్, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్‌) 

శేరిలింగంపల్లి జోన్‌: అమీన్‌పూర్, తెల్లాపూర్,మణికొండ, నార్సింగి (ప్రస్తుతమున్న సర్కిళ్లు: యూసుఫ్‌గూడ, శేరిలింగంపల్లి, చందానగర్, పటాన్‌చెరు) 

ఆయా జోన్లపరిధిలో ప్రస్తుతమున్న సర్కిళ్ల సంఖ్య, విస్తీర్ణం వంటి వాటితోపాటు అంతిమంగా సదరు ప్రాంతాల్లో ఆయా పారీ్టల బలాబలాల వ ంటివి ప్రాధాన్యం వహించగలవని తెలుస్తోంది.  

విలీనానికి సంబంధించి గత నాలుగురోజులుగా కసరత్తు చేస్తున్న సీజీజీ, జీహెచ్‌ఎంసీ అధికారులు ఆయా సర్కిళ్లు, జోన్లు, వార్డుల మ్యాపుల పరిశీలనలు చేస్తున్నారు.  

సంబంధిత ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ ఆమోదం కోసం పంపినట్లు తెలుస్తోంది.  

మణికొండ ఖైరతాబాద్‌ జోన్‌ పరిధిలోకి వచ్చే అవకాశమున్నా.. ఇప్పటికే ఖైరతాబాద్‌ జోన్‌ ఎంతో పెద్దిదిగా ఉంది.  శేరిలింగంపల్లి జోన్‌లో ప్రస్తుతం తక్కువ సర్కిళ్లున్నాయి. (ఖైరతాబాద్‌ జోన్‌ పరిధిలోని ప్రస్తుత సర్కిళ్లు: మెహిదీపట్నం, కార్వాన్, గోషామహల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్‌).  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)