Breaking News

బెట్టింగ్‌ యాప్‌లపై తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

Published on Wed, 03/26/2025 - 14:56

సాక్షి, హైదరాబాద్‌: బెట్టింగ్‌ యాప్‌లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్స్‌పై సిట్‌ ఏర్పాటుకు ఆదేశించింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సిట్‌ విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ పట్ల కఠినంగా ఉండాలని నిర్ణయించామని సీఎం తెలిపారు.

‘‘ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిషేధిస్తూ గత ప్రభుత్వం చట్టం చేసింది.. కానీ అమలు జరగడం లేదు. దర్యాప్తు కోసం స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీంను వేస్తున్నాం. ప్రకటనలు చేసినా.. నిర్వహణలో భాగస్వామ్యం ఉన్నా కఠిన చర్యలు ఉంటాయి. నేరాలు చెప్పి జరగవు. నేరాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది. గతంలో న్యాయవాదులు, వెటర్నరీ డాక్టర్‌ హత్యలు జరిగాయి’’ అని రేవంత్‌ అన్నారు.

ఎంఎంటీఎస్‌ రైలులో అత్యాచారయత్నం ఘటనపై సీఎం రేవంత్‌ స్పందిస్తూ.. శాంతిభద్రతలపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందన్నారు. ‘‘పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో దిశ ఘటన జరిగింది. వామనరావు దంపతులను నడిరోడ్డుపై చంపేశారు. జూబ్లీహిల్స్‌ అత్యాచారం కేసులో బీఆర్‌ఎస్‌  నేత కుమారుడిపై చర్యలు తీసుకోలేదు. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారు. కుట్రలు మాని, విజ్ఞతతో మెలగాలి’’ అని రేవంత్‌రెడ్డి హితవు పలికారు.

 


 

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)