Breaking News

నవీన్‌ మిత్తల్‌ బదిలీ

Published on Fri, 06/13/2025 - 05:33

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) నవీన్‌ మిత్తల్‌ను ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఆయనతో పాటు హైదరాబాద్, మల్కాజిగిరి సహా పలు జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లకు స్థాన చలనం కలిగించింది.    స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రస్తుత కార్యదర్శి బుద్దప్రకాశ్‌ను ఆ పోస్టు నుంచి తప్పించింది. కలెక్టర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ మేరకు కొందరి బదిలీకి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే మిత్తల్‌ను దీర్ఘకాలం పాటు రెవెన్యూ శాఖలో కొనసాగించిన ప్రభుత్వం ఎట్టకేలకు  ఆయన్ను బదిలీ చేసింది.

గత ప్రభుత్వంలో కూడా కీలకంగా వ్యవహరించిన ఆయనపై..అధికారంలోకి రాకముందు విమర్శలు గుప్పించిన కాంగ్రెస్‌ పార్టీ .. అధికారంలోకి వచి్చన తర్వాత కూడా అక్కడే కొనసాగించడం చర్చనీయాంశమయ్యింది. మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌ కూడా బదిలీ అయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఆయన మొత్తం మూడుసార్లు బదిలీ కావడం గమనార్హం.

ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిని ఆశించిన డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ స్థానంలో ఉన్న గౌరవ్‌ ఉప్పల్‌ను కేంద్ర ప్రాజెక్టులు, కేంద్ర ప్రాయోజిత పథకాల సమన్వయ కార్యదర్శిగా సర్కారు నియమించింది. మొత్తం 36 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.  కాగా ప్రసుత్తం పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తున్న గుర్రం మల్సూర్‌ను ముఖ్యమంత్రి ముఖ్య పౌరసంబంధాల అధికారిగా నియమించారు.

బదిలీలు ఇలా.. 

1. డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌; ప్రస్తుతం: స్పెషల్‌ సీఎస్, తెలంగాణ భవన్‌ (ఢిల్లీ); బదిలీ: స్పెషల్‌ సీఎస్, తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌.

2. నవీన్‌ మిత్తల్‌; ప్రస్తుతం: ముఖ్య కార్యదర్శి రెవెన్యూ శాఖ, సీసీఎల్‌ఏ ; బదిలీ: ముఖ్య కార్యదర్శి, ఇంధన శాఖ

3. ఎన్‌. శ్రీధర్‌; ప్రస్తుతం: ముఖ్య కార్యదర్శి, ఎస్సీ అభివృద్ధి శాఖ; బదిలీ: ముఖ్య కార్యదర్శి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,ఆర్‌డబ్ల్యూఎస్, అదనంగా ముఖ్య కార్యదర్శి మైన్స్, జియాలజీ.

4. డాక్టర్‌  జ్యోతి బుద్దప్రకాశ్‌; ప్రస్తుతం: కార్యదర్శి స్టాంప్స్, రిజి్రస్టేషన్స్, గృహనిర్మాణ శాఖ; బదిలీ: కార్యదర్శి ఎస్సీ అభివృద్ధి, అదనంగా ప్రణాళిక శాఖ, టీజీఆర్‌ఏసీ డీజీ.

5. లోకేశ్‌కుమార్‌; ప్రస్తుతం: అదనపు సీఈవో; బదిలీ: పూర్తి అదనపు బాధ్యతలు కార్యదర్శి, రెవెన్యూ, సీసీఎల్‌ఏ.

6.గౌరవ్‌ ఉప్పల్‌; ప్రస్తుతం: రెసిడెంట్‌ కమిషనర్‌ తెలంగాణ భవన్‌ ఢిల్లీ; బదిలీ: కార్యదర్శి సమన్వయం కేంద్ర ప్రాజెక్టులు, ప్రాయోజిత కార్యక్రమాలు.

7. భారతీ లక్పతి నాయక్‌ ; ప్రస్తుతం: కార్యదర్శి, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌; బదిలీ: కార్యదర్శి, సమాచార కమిషన్‌.

8. హరిచందన దాసరి; ప్రస్తుతం: కార్యదర్శి, రోడ్లు, భవనాలు; బదిలీ: కలెక్టర్, హైదరాబాద్‌.

9. కిల్లు శివకుమార్‌నాయుడు; ప్రస్తుతం: అదనపు కమిషనర్‌ జీహెచ్‌ఎంసీ; బదిలీ: కమిషనర్, ఆర్‌ అండ్‌ ఆర్, భూ సేకరణ ఐ క్యాడ్‌.

10. రాజీవ్‌గాంధీ హన్మంతు; ప్రస్తుతం: కలెక్టర్, నిజామాబాద్‌; బదిలీ: ప్రత్యేక కార్యదర్శి, స్టాంప్స్‌ అండ్‌ రిజి్రస్టేషన్స్, కమిషనర్‌ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ అదనపు బాధ్యతలు.

11. వినయ్‌ కృష్ణారెడ్డి; ప్రస్తుతం:     కమిషనర్‌ ఆర్,ఆర్‌ అండ్‌ ఎల్‌ ఏ, ఐ క్యాడ్‌; బదిలీ: కలెక్టర్, నిజామాబాద్‌.

12. జి.శ్రీజన ; ప్రస్తుతం: డైరెక్టర్, పీఆర్‌ అండ్‌ ఆర్‌డీ; బదిలీ: డైరెక్టర్‌ మహిళా శిశు సంక్షేమం(అదనపు బాధ్యతలు).

13. శివశంకర్‌ లాహోటి; ప్రస్తుతం: వెయిటింగ్‌ ఫర్‌ పోస్టింగ్‌; బదిలీ: సంయుక్త కార్యదర్శి, వ్యవసాయం, సహకార శాఖ, సంయుక్త కార్యదర్శి డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (అదనపు బాధ్యతలు)

14. చిట్టెం లక్ష్మి; ప్రస్తుతం: వెయిటింగ్‌ ఫర్‌ పోస్టింగ్‌; బదిలీ: సంయుక్త కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ.
15. కె.హైమావతి; ప్రస్తుతం: పీడీ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సోసైటీ; బదిలీ: కలెక్టర్, సిద్దిపేట.

16. వాసం వెంకటేశ్వర్లు; ప్రస్తుతం: డైరెక్టర్‌ యువజన సరీ్వసులు; బదిలీ:డైరెక్టర్, ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ, డైరెక్టర్, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్, కుటుంబ సంక్షేమం.

17. వీపీ గౌతమ్‌ ; ప్రస్తుతం: ప్రత్యేక కార్యదర్శి, గృహ నిర్మాణం; బదిలీ: కార్యదర్శి, గృహ నిర్మాణ శాఖ (అదనపు బాధ్యతలు)

18. గౌతం పొట్రూ; ప్రస్తుతం: కలెక్టర్, మల్కాజిగిరి–మేడ్చల్‌; బదిలీ:  డైరెక్టర్‌ సింగరేణి పర్సనెల్‌ అండ్‌ అడ్మిని్రస్టేషన్‌.

19.కె. నిఖిల; ప్రస్తుతం: సీఈవో, టీజీఐఆర్‌డీ; బదిలీ: డైరెక్టర్, మత్స్యశాఖ, సీఈవో (టీజీఐఆర్‌డీ అదనపు బాధ్యతలు)

20.వల్లూరి క్రాంతి; ప్రస్తుతం: కలెక్టర్, సంగారెడ్డి; బదిలీ:    మేనేజింగ్‌ డైరెక్టర్‌ , పర్యాటకాభివృద్ధి సంస్థ

21.ఉదయ్‌కుమార్‌; బదిలీ: సీఈవో, ఆరోగ్యశ్రీ ట్రస్ట్, ప్రత్యేక కార్యదర్శి, పీఈ శాఖ

22. ప్రియాంక ఆలా ; ప్రస్తుతం: డైరెక్టర్, మత్స్య శాఖ; బదిలీ: కార్యదర్శి, తెలంగాణ పబ్లిక్‌ సరీ్వస్‌ కమిషన్‌.

23. పి. ప్రావీణ్య; ప్రస్తుతం: కలెక్టర్, హనుమకొండ; బదిలీ: కలెక్టర్, సంగారెడ్డి.

24. నిర్మలా కాంతివెస్లీ ; బదిలీ: కార్యదర్శి, సీఈవో, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, వీసీ అండ్‌ ఎండీ మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌.

25. మిక్కిలినేని మనుచౌదరి; బదిలీ: కలెక్టర్, మేడ్చల్‌–మల్కాజిగిరి.

26. ముజమ్మిల్‌ ఖాన్‌; ప్రస్తుతం: కలెక్టర్, ఖమ్మం; బదిలీ: డైరెక్టర్‌ సివిల్‌ సప్లయ్స్, సీఆర్‌వో హైదరాబాద్‌ (అదనపు బాధ్యతలు).

27. స్నేహ శబరీ‹Ù ; ప్రస్తుతం: అదనపు కమిషనర్, జీహెచ్‌ఎంసీ; బదిలీ: కలెక్టర్, హనుమకొండ

 28. అనుదీప్‌ దురిశెట్టి; ప్రస్తుతం: కలెక్టర్, హైదరాబాద్‌; బదిలీ: కలెక్టర్, ఖమ్మం

29. నవీన్‌ నికోలస్‌; ప్రస్తుతం: కార్యదర్శి, టీజీపీఎస్‌సీ; బదిలీ: డైరెక్టర్,  పాఠశాల విద్య, (ఎస్‌ ఎస్‌ఏ పీడీగా అదనపు బాధ్యతలు).

30. చెక్క ప్రియాంక ; ప్రస్తుతం: ఉప కార్యదర్శి, ఎంఏ అండ్‌ యూడీ; బదిలీ: స్పెషల్‌ కమిషనర్, ఐ అండ్‌ పీఆర్‌.

31. చాహత్‌ బాజ్‌పేయి; ప్రస్తుతం: కమిషనర్, కరీంనగర్‌ కార్పొరేషన్‌; బదిలీ: కమిషనర్, గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌.

32. అశ్విని తానాజీ వకాడే; బదిలీ: అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) కరీంనగర్‌

33. ప్రఫుల్‌ దేశాయ్‌; బదిలీ: కమిషనర్, కరీంనగర్‌ కార్పొరేషన్‌.

34. షఫీయుల్లా; ప్రస్తుతం: ప్రత్యేక కమిషనర్, గ్రామీణాభివృద్ధి; బదిలీ: కార్యదర్శి, మైనారిటీ సంక్షేమం, కార్యదర్శి, మైనారిటీ స్కూల్స్‌ (అదనపు బాధ్యతలు)

35. వీఎస్‌ఎన్‌వీ ప్రసాద్‌ (ఐఎఫ్‌ఎస్‌); బదిలీ: డైరెక్టర్, హెచ్‌ఎండీ

 36. నిఖిల్‌ చక్రవర్తి; ప్రస్తుతం: ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, టీజీఐఐసీ; బదిలీ: డైరెక్టర్, పరిశ్రమల శాఖ,  

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)