Breaking News

రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నగదు జమ

Published on Wed, 02/05/2025 - 12:24

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం బుధవారం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మండలాల్లో గ్రామాల వారీగా నగదు జమ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేసింది. మొత్తంగా 17.03 లక్షల రైతుల అకౌంట్లకు ఇవాళ రైతుభరోసా నిధులు జమ కానున్నట్లు సమాచారం. 

నాలుగు పథకాల అమలులో భాగంగా.. గణతంత్ర దినోత్సవంనాడు రైతు భరోసా నిధులను విడుదల చేసింది. అయితే ఆరోజు  సెలవు రోజు కావడంతో.. ఆ మరుసటిరోజు రాష్ట్ర ప్రభుత్వం 32 జిల్లాల్లోని 563 గ్రామాల్లో 4,41,911 మంది రైతులకు ఒక్కో ఎకరానికి తొలి విడతగా రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. ఆయా గ్రామాల్లో 9,48,333 ఎకరాల విస్తీర్ణంలోని సాగుభూమికి రూ.569 కోట్లను చెల్లించింది. 

ఇక భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థికసాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి శ్రీకారం చుట్టింది. మొదటి రోజున 18,180 కుటుంబాలకు మొదటి విడతగా రూ.6 వేల నగదును వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకానికి తొలి రోజున ఆర్థికశాఖ రూ.10.91 కోట్లు విడుదల చేసింది. రైతు భరోసా నగదు జమ ఆలస్యం అవుతుండడంతో.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ తీవ్ర విమర్శలు చేస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)