Breaking News

‘స్థానిక’ స్థానాలు ఖరారు

Published on Thu, 07/17/2025 - 02:28

సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్రంలో జెడ్పీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్రంలో జిల్లా ప్రజా పరిషత్‌లు 31,  జెడ్పీటీసీ స్థానాలు 566, మండల ప్రజా పరిషత్‌లు 566, ఎంపీటీసీ స్థానాలు 5,773, గ్రామపంచాయతీలు 12,778, వార్డులు 1,12,694 ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక  2019లో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

అప్పుడు 32 జెడ్పీపీలు, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు 570 చొప్పున, ఎంపీటీసీలు 5,817, గ్రామ పంచాయతీలు 12,848 ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే ఇప్పుడు 1 జెడ్పీపీ, నాలుగు జెడ్పీటీసీ, నాలుగు ఎంపీపీలు, 44 ఎంపీటీసీ స్థానాలు, 70 గ్రామపంచాయతీలు తగ్గాయి. మేడ్చల్‌–మల్కాజిగిరిలోని మెజారిటీ గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో ఈ గ్రామీణ జిల్లా ఉనికి లేకుండా పోయింది. దీనివల్లే ఒక జెడ్పీపీ, 4 జెడ్పీటీసీల సంఖ్య తగ్గింది.

మరికొన్ని జిల్లాల్లోనూ పంచాయతీలు సమీప మున్సిపాలిటీల్లో విలీనం కావడం, ఇతర కారణాలతో గ్రామ పంచాయతీల సంఖ్య తగ్గింది. సంఖ్యాపరంగా చూస్తే...నల్లగొండ జిల్లా 33 జడ్పీటీసీలు, 33 ఎంపీపీలు, 353 ఎంపీటీసీ స్థానాలతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇక ములుగు జిల్లా 10 జడ్పీటీసీలు, 10 ఎంపీపీలు, 83 ఎంపీటీసీ స్థానాలతో అత్యల్ప స్థానాలున్న జిల్లాగా నిలిచింది. 

టాప్‌–5, లాస్ట్‌–5 జిల్లాల్లోని స్థానాలు ఇలా.. 
టాప్‌–5 జిల్లాలు... 
నల్లగొండ: 1 జడ్పీ, 33 జడ్పీటీసీలు, 33 ఎంపీపీలు, 353 ఎంపీటీసీ స్థానాలు 
నిజామాబాద్‌: 1 జడ్పీ, 31 జడ్పీటీసీలు, 31 ఎంపీపీలు, 307 ఎంపీటీసీ స్థానాలు 
ఖమ్మం: 1 జడ్పీ, 20 జడ్పీటీసీలు, 20 ఎంపీపీలు, 283 ఎంపీటీసీ స్థానాలు 
సంగారెడ్డి: 1 జడ్పీ, 26 జడ్పీటీసీలు, 26 ఎంపీపీలు, 271 ఎంపీటీసీ స్థానాలు 
సూర్యాపేట: 1 జడ్పీ, 23 జడ్పీటీసీలు, 23 ఎంపీపీలు, 235 ఎంపీటీసీ స్థానాలు 

లాస్ట్‌–5 జిల్లాలు... 
ములుగు: 1 జడ్పీ, 10 జడ్పీటీసీలు, 10 ఎంపీపీలు, 83 ఎంపీటీసీ స్థానాలు 
వరంగల్‌: 1 జడ్పీ, 11 జడ్పీటీసీలు, 11 ఎంపీపీలు, 130 ఎంపీటీసీ స్థానాలు 
రాజన్న సిరిసిల్ల: 1 జడ్పీ, 12 జడ్పీటీసీలు, 12 ఎంపీపీలు, 123 ఎంపీటీసీ స్థానాలు 
వనపర్తి: 1 జడ్పీ, 15 జడ్పీటీసీలు, 15 ఎంపీపీలు, 133 ఎంపీటీసీ స్థానాలు 
మంచిర్యాల: 1 జడ్పీ, 16 జడ్పీటీసీలు, 16 ఎంపీపీలు, 129 ఎంపీటీసీ స్థానాలు 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)