Breaking News

Telangana Formation Day: రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం

Published on Mon, 06/02/2025 - 09:46

హైదరాబాద్, సాక్షి: దశాబ్దాల పోరాటంతో తెలంగాణను సాధించుకున్నామని.. పదేళ్ల తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి (Anumula Revanth Reddy) అన్నారు. సోమవారం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో(Telangana Formation Day Celebrations) పాల్గొని ఆయన ప్రసంగించారు.

‘‘దశాబ్దాల పోరాటంతో తెలంగాణను సాధించుకున్నాం. రాష్ట్రం వచ్చి పదేళ్లు అయినా ఆకాంక్షలు నెరవేరలేదు. జరిగిన తప్పిదాలను సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం. ఇది సకల జనుల ఆకాంక్షలు నెరవేరిన రోజు.  

తెలంగాణ సమాజానికి మహిళలే పునాది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది.

ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేశాం. రూ.2 లక్షల రైతురుణమాఫీ చేసి రుణవిముక్తులను చేశాం. రైతులు ఆత్మగౌరవంగా బతికేలా చేశాం. తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగింది. రైతులు దళారుల బారిన పడకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 8వేల కొనుగోలు కేంద్రాలను తీసుకొచ్చాం. భూభారతి చట్టం తీసుకొచ్చాం. ధరణి కొందరికి చుట్టమైతే.. భూభారతి ప్రజలకు రక్షణ. 

ఒలింపిక్స్‌లో మన దేశానికి అనుకున్నంత స్థాయిలో పథకాలు రాలేదు. మట్టిలో మాణిక్యాలను తయారు చేసేందుకు స్పోర్ట్స్‌ అకాడమీ తీసుకొచ్చాం. వచ్చే ఒలింపిక్స్‌లో తెలంగాణ నుంచి బంగారు పతకం తేవడమే మా లక్ష్యం. పేదల ఆరోగ్యం మా ప్రభుత్వ బాధ్యత. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నాం. ఇప్పటిదాకా 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించాం. ఏడాదిలో 60 వేల ఉద్యోగాలు కల్పించాం. ప్రతి నియోజకవర్గానికి యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌కు శ్రీకారం చుట్టాం. సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్న వాళ్లకు ఆర్థిక సాయం అందిస్తున్నాం. విద్య మీద పెట్టేది ఖర్చు కాదు.. భవిష్యత్‌ పెట్టుబడి’’ అని సీఎం రేవంత్‌ ప్రసంగించారు.

ప్రసంగానికి ముందు జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన.. పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రేవంత్‌ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. అంతకు ముందు..

గన్ పార్క్‌లో అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నివాళులర్పించారు. ఈ వేడుకలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. మరోవైపు రాజ్‌భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ.. తెలంగాణ అభివృద్ధి కొనసాగాలని ఆకాంక్షించారు.

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు