Breaking News

వచ్చే ఫిబ్రవరిలో 21వ బయో ఏసియా సదస్సు

Published on Sun, 08/20/2023 - 04:45

సాక్షి, హైదరాబాద్‌: బయో ఏసియా 21వ వార్షిక సదస్సు తేదీలను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ శనివారం ప్రకటించారు. హైదరాబాద్‌ వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న ఈ సదస్సు వచ్చే ఏడాది ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో జరుగుతుందన్నారు. ‘డేటా అండ్‌ ఏఐ–రీడిఫైనింగ్‌ పాజిబిలిటీస్‌’అనే నినాదంతో ఈ సదస్సు జరుగుతుందని కేటీఆర్‌ వెల్లడించారు.

హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్, బయో టెక్నాలజీ రంగాల్లో భవిష్యత్‌లో డేటా ఆధారిత సాంకేతికత, కృత్రిమ మేధస్సు పోషించే పాత్రపై 2024 బయో ఏసియా సదస్సులో చర్చిస్తారన్నారు. అన్ని రంగాల్లో డిజిటల్‌ ఆవిష్కరణల ఫలితాల ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో టెక్నాలజీ, లైఫ్‌సైన్సెస్‌ సంగమం ద్వారా అద్భుత ఫలితాలు సాధించే అవకాశముందని కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఆరోగ్యరక్షణ రంగంలో ఆవిష్కరణ శకం నడుస్తున్న ప్రస్తుత సమయంలో బయో ఏసియా సదస్సుకు అత్యంత ప్రాధాన్యం ఉందని కేటీఆర్‌ వెల్లడించారు. ప్రగతిభవన్‌లో బయో ఏసియా తేదీల ప్రకటన కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే వివేకానంద, బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కనీ్వనర్లు మన్నె క్రిషాంక్, పాటిమీది జగన్మోహన్‌రావు, వై.సతీశ్‌రెడ్డి, లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తి నాగప్పన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)