Breaking News

ముఖరా కే గ్రామం పల్లెలకు ఆదర్శం కావాలి: ఎర్రబెల్లి 

Published on Mon, 01/02/2023 - 00:50

సాక్షి, హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా కే గ్రామం పల్లెప్రగతి విజయవంతంగా అమలు చేసి స్వయం సమృద్ధి గ్రామంగా అభివృద్ధి చెందుతోందని పంచాయతీరాజ్‌ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. పల్లెప్రగతి ద్వారా సమకూర్చిన ట్రాక్టర్, అమలు చేస్తున్న తడి చెత్త, పొడి చెత్త విధానం, డంపింగ్‌ యార్డు నిర్వహణ, కంపోస్ట్‌ ఎరువు తయారీ ఇప్పుడు ఆ గ్రామానికి ఆదాయ మార్గంగా మారిందన్నారు.

ఈమేరకు ఆదివారం మంత్రిని కలిసి సర్పంచ్‌ దంపతులు తమ గ్రామంలో తయారు చేసిన వర్మీకంపోస్ట్‌ను అందజేశారు. ట్రాక్టర్‌ ద్వారా చెత్త సేకరణ, దాన్ని వర్మీకంపోస్ట్‌ ఎరువుగా మార్చడం ద్వారా ఈ గ్రామ సర్పంచ్‌ గాడిగె మీనాక్షి ఏడాదిన్నరలో రూ.7 లక్షల ఆదాయం సంపాదించారు. ఇందులో రూ.4 లక్షలతో సోలార్‌ లైట్లు, రూ.2 లక్షలతో డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేశారు.

ఆర్గానిక్‌ కంపోస్ట్‌ తయారు చేయడమే కాకుండా దానిద్వారా వచ్చే లాభాలను రైతులకు వివరించడం ద్వారా వంద మంది ఆ గ్రామంలో ఆర్గానిక్‌ పంటలు పండిస్తున్నట్లు సర్పంచ్‌ వివరించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి గ్రామ సర్పంచ్‌ను అభినందించారు. పల్లెప్రగతి స్ఫూర్తిని అర్థం చేసుకుని ప్రతి పల్లె స్వయం సమృద్ధంగా మారాలని, పరిశుభ్రంగా ఉంటూ, పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)