Breaking News

Chevella tragedy: తడి ఆరని కళ్లు

Published on Wed, 11/05/2025 - 05:57

పెద్దమ్మ కొడుకు పెళ్లికి వస్తే ముగ్గురికి చీరలు కట్టి వాళ్లమ్మ మురిసిపోయింది. ముద్దుగా తయారైండ్రు.. ఎవరి దిష్టి తగిలిందో నా బిడ్డలకు.. మమ్ములను దిక్కులేనోళ్లను చేసి వెళ్లిపోయిండ్రు. రెండు నెలల్ల ఇద్దరం జాబ్‌ చేస్తం.. వచ్చి నిన్ను అమ్మను హైదరాబాద్‌ తీస్కపోతాం నాయినా అంటూ చెప్పి బస్సెక్కిండ్రు. ఇట్ల నన్ను పూర్తిగా ఇడిసిబెట్టి పోతరనుకోలేదు..    – ఎల్లయ్యగౌడ్‌  

వికారాబాద్‌: ‘అయ్యో పాపం ఎల్లయ్యా.. నీకు నలుగురూ బిడ్డలేనా అని చాలామంది మాట్లాడినా ఎన్నడూ బాధ కాలేదు. నా నలుగురు కూతుళ్లు ‘నిన్ను నలుగురిలో దర్జాగా నిలబెడతాం... నిన్ను గెలిపిస్తాం నాయనా’ అని నాకు కొండంత ధైర్యం చెప్పేవారు. ఒక బిడ్డకు పెళ్లి చేసి, అత్తగారింటికి పంపి నెలకూడా కాకుండానే మిగతా ముగ్గురు బిడ్డలను దేవుడు తీస్కపోయిండు’ అంటూ అంబిక–ఎల్లయ్యగౌడ్‌ దంపతులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చెట్టంత బిడ్డలను పోగొట్టుకున్న వీరి బాధ వర్ణనాతీతం.

సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల (Chevella) మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వికారాబాద్‌ జిల్లా యాలాల మండల పరిధిలోని పెర్కంపల్లికి చెందిన తనూష, సాయిప్రియ, నందిని మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారం ‘సాక్షి’ఎల్లయ్యగౌడ్‌ను కలిసి పరామర్శించే ప్రయత్నం చేయగా, కూతుళ్ల గురించి విలపిస్తూ చెప్పిన జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే... 

‘సదువులో ఎప్పుడూ ముందుండేవారు. వారు బాగా సదివి నాకు ఫీజులు తగ్గించేవారు.. అందరూ రెకమండేషన్లు అంటూ నాయకుల చుట్టూ తిరిగి ఫీజులు తగ్గించుకుంటే, నా బిడ్డలు బాగా సదివి క్లాస్‌ ఫస్ట్‌ వచ్చేవారు.. మా నాయన డ్రైవింగ్‌ చేస్తాడు.. మేము బాగా సదువుతున్నాంగా.. ఫీజు తగ్గించండని సార్లను అడిగి తక్కువ చేయించేవారు. ఇంటర్‌ సదివేటప్పుడే యోగా నేర్చుకొని, అంతా యోగా టీచర్లు అయ్యారు.. వాళ్లే వేరే వాళ్లకు నేర్పించెటోళ్లు. కూతుళ్లను సదివించటానికే ఊర్లోనుంచి తాండూరు టౌన్‌కు వచ్చేశా. ఇప్పుడు వాళ్లే లేకపోతే నాకు దిక్కెవరు.  

జిల్లేడు చెట్టుకు పెళ్లి చేస్తా అనుకోలేదు బిడ్డా..
నా బిడ్డలు బాగా సదివి నన్ను నలుగుట్లో గొప్పగా నిలబెడతమన్నారు. కానీ ఇట్ల మమ్ములనే ఒంటరోళ్లను చేసి పోతారనుకోలేదు. బాగా సదివించి కొలువులు చేస్తుంటే.. శాతనైనంతలో గొప్పగా పెళ్లిళ్లు చేసి అత్తగారింటికి సాగనంపుతాననుకున్నా. కానీ ఇట్ల జిల్లెడు చెట్టుకు పెళ్లిళ్లు చేసి ముగ్గురిని ఒకేసారి పాడెగట్టి సాగనంపుతానను కోలేదు. మొన్న పెద్దమ్మ కొడుకు పెళ్లికి వస్తే ముగ్గురికి చీరలు కట్టి వాళ్లమ్మ మురిసిపోయింది. ముద్దుగా తయారైండ్రు.. ఎవరి దిష్టి తగిలిందో నా బిడ్డలకు ..మమ్ములను దిక్కులేనోళ్లను చేసి వెళ్లిపోయిండ్రు.

పదోతరగతి, ఇంటర్‌లో ఒచ్చిన మార్కులు చూసి.. సదువులో నా బిడ్డెల ఉశారు సూసి కోఠి ఉమెన్స్‌ కాలేజీలో మేడం ఫ్రీ సీటు ఇచ్చింది. నేను మంచి అంగి తొడుక్కోకపోయినా నా చిన్నబిడ్డ ఒప్పుకునేది కాదు.. మంచి అంగి తొడిగి తలదువ్వి నొసటికి బొట్టుపెట్టి భుజంపై తట్టేది. చెప్పులు పాతగ అయితే వాళ్లకు ఇచ్చిన ఖర్చుల్లోకి మిగలవట్టి కొత్త చెప్పులు తెచ్చెటోళ్లు.. డ్రైవింగ్‌ చేయడానికి పోతే చాయ్‌ బిస్కెట్‌ కూడా తాగెటోన్ని కాదు.

పది రూపాయలు ఉంటే నా బిడ్డలకు పెన్ను కొనివ్వచ్చు. 20 రూపాయలు ఉంటే నోటు బుక్కు వస్తదికదా అనుకునే వాన్ని. వాళ్లు హైదరాబాద్‌లో ఉన్నా, కూడా రోజు మూడుసార్లు ఫోన్‌ చేసేవారు..తిన్నావా? టీ.తాగినవా నాయిన ఇంటికి పోయినవా.. తొందరగా ఇంటికిపో అంటూ గుర్తు చేస్తుండ్రి.. రెండు నెలల్ల ఇద్దరం జాబ్‌ చేస్తం.. వచ్చి నిన్ను అమ్మను హైదరాబాద్‌ (Hyderabad) తీస్కపోతాం నాయినా అంటూ చెప్పి బస్సెక్కిండ్రు. ఇట్ల నన్ను పూర్తిగా ఇడిసిబెట్టి పోతరనుకోలేదు.. ముగ్గురు బిడ్డలు ఎప్పు డూ ఒకేసారి బస్సుల పోలేదు. సాయిప్రియ రైల్లో పోతే ఇద్దరు బిడ్డలు బస్సుల పోతుండ్రి.. ఇప్పుడే ఇట్ల ముగ్గురు ఒకే బస్సుల పోయిండ్రు.. తిరిగి రాలేదు. నా ధైర్యం మొ త్తం వాల్లే.. ఇప్పుడు వాళ్లే లేకపోతే ఎట్లుండాల్నో ఏమి అర్థం అయితలేదు’అంటూ ఎల్లయ్యగౌడ్‌ కన్నీరు మున్నీరయ్యాడు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)