Breaking News

హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు.. కేటాయింపులు ఇలా..

Published on Thu, 07/25/2024 - 16:02

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత గురువారం తొలిసారి అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. 2024-25 సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ బడ్జెట్‌ను రూ. 2,91,159 కోట్లుగా ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్ర అప్పు 6 లక్షల 71 వేల 757 కోట్లుగా ఉందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం  వచ్చిన తర్వాత రూ. 35,118 కోట్ల అప్పు తీసుకోగా , రూ. 42 వేల కోట్ల బకాయిలు చెల్లించినట్లు వెల్లడించారు.

రాష్ట్ర బడ్జెట్‌లో హైదరాబాద్‌ నగర అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు భారీగా రూ. 10 వేల కోట్లు కేటాయించారు. ఇందులో మెట్రో వాటర్‌ వర్స్‌ కోసం రూ. 3,385 కోట్లు, జీహెచ్‌ఎంసీకి రూ. 3,065కోట్లు, మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు కోసం రూ.1500 కోట్లు, ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టు రూ.1,525 కోట్లు.

పాతబస్తీ మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు, ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు రూ.200 కోట్లు, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు, శంషాబాద్‌ విమానాశ్రయం కోసం రూ. 100 కోట్లు, హెచ్‌ఎండీేఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ. 500 కోట్లు, హైడ్రా సంస్థకు రూ.200 కోట్లు కేటాయించారు. మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు, ఎంఎంటీఎస్‌ రూ. 50  కోట్లు కేటాయించారు.

ఈ సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రాత్మక నగరం హైదరాబాద్‌ను మరింత ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ నగర ప్రాధాన్యం దృష్ట్యా నగరాభివృద్ధికి మరింత పెద్దపీట వేశామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి మరింత వేగంగా జరగబోతోందని, అందుకే బడ్జెట్ ఫోకస్ ఎక్కువగా సిటిపై పెట్టామని అన్నారు.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)