Breaking News

టీజీబీపాస్‌ సర్వర్‌డౌన్‌.. వీకెండ్స్‌లోనే ఎందుకిలా?

Published on Sat, 12/14/2024 - 19:09

సాక్షి, హైద‌రాబాద్‌: లేఅవుట్‌లు, భవనాల నిర్మాణాలు, ఎల్‌ఆర్‌ఎస్‌ తదితర అనుమతుల కోసం అందుబాటులోకి తెచ్చిన సింగిల్‌విండో సాంకేతిక వ్యవస్థ టీజీబీపాస్‌ శుక్రవారం మరోసారి స్తంభించింది. దీంతో హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ విభాగంలో పనులు నిలిచిపోయాయి. ఫైళ్ల పరిష్కారంలో తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంది. వివిధ రకాల అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తుదారులు గంటల తరబడి పడిగాపులు కాశారు. టీజీబీపాస్‌లో సర్వర్‌డౌన్‌ కావడం వల్లనే  సమస్యలు తలెత్తినట్లు అధికారులు చెప్పారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచే హెచ్‌ఎండీఏ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది.

మరోవైపు ఇళ్లు, భవనాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్‌ చేయలేకపోయారు. పలు కన్సల్టెన్సీల్లో సైతం పనులు నిలిచిపోయాయి. టీజీబీపాస్‌లో తరచుగా సమస్యలు తలెత్తుతున్నట్లు అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సకాలంలో ఫైళ్లను పరిష్కరించలేకపోతున్నట్లు పేర్కొన్నారు. హెచ్‌ఎండీఏలోని ఘట్కేసర్, మేడ్చల్‌–1, మేడ్చల్‌–2,  శంషాబాద్, శంకర్‌పల్లి–1, శంకర్‌పల్లి–2 జోన్‌లలో ప్రతి రోజు వివిధ రకాల అనుమతుల కోసం సుమారు 100 వరకు వస్తాయి. ప్రణాళికా విభాగంలోని వివిధ స్థాయిల్లో ఈ ఫైళ్లను పరిశీలించి, చివరకు కమిషనర్‌ ఆమోదంతో అనుమతులు అందజేస్తారు.

చ‌ద‌వండి: హైదరాబాద్‌లోనే ఎక్కువ.. సూపర్‌ పవర్‌! 

ఫైళ్ల పరిష్కారంలో జాప్యాన్ని నివారించేందుకు ఇటీవల హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ప్రత్యేకంగా దృష్టి సారించారు. పెండింగ్‌ ఫైళ్ల క్లియరెన్స్‌ కోసం చర్యలు చేపట్టారు. 10 రోజుల్లోనే దరఖాస్తుదారులకు అనుమతులను అందజేసేవిధంగా చర్యలు తీసుకున్నారు. కానీ తరచుగా తలెత్తే ఇలాంటి సాంకేతిక సమస్యల వల్ల ఆటంకం కలిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వీకెండ్స్‌లోనే ఇలాంటి సమస్యలు  ఎక్కువగా వస్తున్నాయని పలువురు దరఖాస్తుదారులు చెప్పారు. టీజీబీపాస్‌ సర్వర్‌డౌన్‌ కావడంతో హెచ్‌ఎండీఏతో పాటు జీహెచ్‌ఎంసీ, నగర శివార్లలోని మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో కూడా అనుమతుల ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది.   

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)