Breaking News

జీహెచ్‌ఎంసీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. బీజేపీ కార్పొరేటర్ల ధర్నా

Published on Mon, 06/16/2025 - 12:32

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని జీహెచ్‌ఎంసీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ నేతలు, కార్యకర్తలు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొంది.

వివరాల ప్రకారం.. జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు బీజేపీ కార్పొరేటర్లు, నేతలు నిరసనకు దిగారు. నగరంలో ఉన్న సమస్యలపై కమిషనర్‌కు వినతి పత్రం ఇస్తామన్న బీజేపీ కార్పొరేటర్లు. ప్రజా సమస్యలపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ మెమోరండం ఇచ్చేందుకు కార్పొరేట్లరు లోపలికి వెళ్తాన్నారు. దీంతో, 15 మందిని లోపలికి అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. కానీ, అందరినీ అనుమతించాలని ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆఫీసు ఎదుట బారికేడ్లు పెట్టి వారిని నిలిపివేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బీజేపీ కార్యకర్తలు బారికేడ్లు, గేట్లను ఎక్కి ఆఫీసులోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో.. పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ సందర్భంగా బీజేపీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ మాట్లాడుతూ.. ‘ప్రజలకు కనీస సౌకర్యాలు లేకుండా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. కనీస సౌకర్యాలు ఇవ్వడం చేతకాదు కానీ.. అందాల పోటీలు పెట్టడానికి కోట్లు ఖర్చు చేశారు. అందాల పోటీలకు పెట్టే ఖర్చు పెడితే.. వీధి లైట్లు, నీళ్లు రావా?. కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వకుండా అప్పులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతుంది. ప్రజలకు కనీస అవసరాలైన నీళ్లు, రోడ్లు, డ్రైనేజీ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని వ్యాఖ్యలు చేశారు. 

GHMC వద్ద హైటెన్షన్

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)