Breaking News

రెండు రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం

Published on Sun, 10/26/2025 - 06:05

సాక్షి, హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీని బలోపేతం చేయడంతోపాటు అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడంపై రాంచందర్‌రావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌లు శనివారం ఇక్కడి బీజేపీ కార్యాలయంలో చర్చలు జరిపారు. ఏపీ బీజేపీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన మాధవ్, రాంచందర్‌రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో కేంద్ర పథకాలు అమలవుతున్న తీరు, వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై సమాలోచనలు జరిపారు.

సమావేశం తర్వాత రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ, పార్టీని మరింత విస్తరిస్తామని తెలిపారు. మాధవ్‌ మాట్లాడుతూ.. గతంలో బీజేపీ యువమోర్చా, పార్టీ ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా పనిచేసిన సందర్భాల్లో పలుమార్లు హైదరాబాద్‌ కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలోనూ త్వరలోనే డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఏర్పాటు అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ కార్యాలయానికి రావడం స్వగృహానికి వచ్చినట్లుగా ఉందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలోనూ విస్తృత పరిచయాలు ఉన్న రాంచందర్‌రావు ఇక్కడ అధ్యక్షుడు కావడం ఆనందంగా ఉందన్నారు.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)