Breaking News

తెలంగాణకు వాతావరణశాఖ బిగ్‌ అలర్ట్‌

Published on Wed, 06/10/2026 - 12:20

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాల ప్రభావంతో దక్షిణ భారతదేశంలో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, మరికొన్ని గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడనుంది. ముఖ్యంగా రంగారెడ్డి, నల్గొండ, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, యాదాద్రి-భువనగిరి, సూర్యాపేట, జంగావు, ఖమ్మం, మహబూబాబాద్‌, భద్రాద్రి-కొత్తగూడెం, హనుమకొండ, సిద్దిపేట, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో మధ్యాహ్నం తర్వాత నుంచి రాత్రి వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇక ఉత్తర–తూర్పు తెలంగాణలో ఉష్ణోగ్రతలు 41–43°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో 37–40 డిగ్రీల సెల్సియస్‌తో మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం కొనసాగనుంది. అయితే మధ్యాహ్నం తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తోంది. సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.

కొన్ని ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్ అంతరాయాలు, నీటి నిల్వలు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

రైతులు, ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లకూడదని, నదులు, వాగుల వద్దకు చేరకూడదని స్థానిక యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది. వర్షాల తీవ్రత గంటల వ్యవధిలోనే పెరిగే అవకాశం ఉండటంతో అన్ని జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి.

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు