Breaking News

జనతా గ్యారేజ్‌లా తెలంగాణ భవన్‌: కేటీఆర్‌

Published on Wed, 04/23/2025 - 16:21

హన్మకొండ, సాక్షి: తెలంగాణలో కష్టం అనే మాట వినబడితే.. బాధితులకు అండగా నిలబడేది గులాబీ జెండా ఒక్కటేనని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల రామారావు‌ అన్నారు. బుధవారం ఎల్కతుర్తితో పర్యటించిన ఆయన.. బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభా ఏర్పాట్లను పర్యవేక్షించి మీడియాతో మాట్లాడారు. 

ముందుగా.. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి బీఆర్‌ఎస్‌ నేతలంతా నివాళులర్పించారు.  బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ ప్రజల్ని రెచ్చగొట్టడానికో, ప్రభుత్వ వ్యతిరేకతను పెంచడానికి కాదని.. 25 వసంతాలు పూర్తి చేసుకున్నందున జరుపుకొనే వేడుక మాత్రమేనని తెలిపారాయన. 

ఇక్కడ 1,250 ఎకరాల్లో సభా స్థలం ఉండగా.. వెయ్యి ఎకరాలు పార్కింగ్‌ కోసం కేటాయించాం. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలూ ఏర్పాటు చేస్తున్నాం.  సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్య తాగునీటి వసతి కల్పిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటుపై నమ్మకం లేనందున జెనరేటర్లు ఏర్పాటు చేశాం. బీఆర్‌ఎస్‌ చరిత్రలో ఇది భారీ బహిరంగ సభ కాబోతుంది. 

గతంలో ఉద్యమ పార్టీగా ప్రతిపక్షంగా, ప్రభుత్వంలో ఎక్కడ ఉన్నా తెలంగాణ కీర్తిని హిమాలయాల స్థాయికి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దేనని కేటీఆర్‌ అన్నారు. 14 ఏళ్ల పాటు నిర్విరామంగా పోరాటం చేసి అన్ని వర్గాలను సమీకరించి రాష్ట్ర సాధన ఉద్యమం చేసిన పార్టీ బీఆర్‌ఎస్‌. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం బీఆర్‌ఎస్‌. గులాబీ జెండా అన్ని వర్గాలకు అండగా ఉంటుందనే పద్ధతిలో ప్రజలు గులాబీ జెండా వైపు చూస్తున్నారు. ఏ సమస్య వచ్చినా తెలంగాణ భవన్‌ వైపు చూస్తున్నారు. తెలంగాణ భవన్‌ ఒక జనతా గ్యారేజ్‌లా మారింది’’ అని కేటీఆర్‌ అన్నారు.

KTR: తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్..

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)