Breaking News

నైరుతి రెండో భాగంలోనూ లోటు!

Published on Sun, 08/02/2026 - 05:08

సాక్షి, హైదరాబాద్‌: తీవ్ర వర్షాభావ పరిస్థితులతోనే నైరుతి రుతుపవనాల సీజన్‌ అర్ధభాగం ముగిసింది. సెప్టెంబర్‌ ఆఖరుతో సీజన్‌ ముగియనుండగా... నైరుతి రెండో అర్ధభాగం కూడా లోటు వర్షాలే నమోదవుతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఆగస్టు,  సెప్టెంబర్ లో రాష్ట్రవ్యాప్తంగా సాధారణం, సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం లోటులోనే ఉంటుందని వివరించింది. ఆగస్టుకు సంబంధించిన అంచనాలను పరిశీలిస్తే.. వానలు తక్కువగా నమోదై... ఎండలు ఎక్కువగా ఉంటాయని వివరించింది. 

వాతావరణ శాఖ అంచనాలు ఇలా... 
⇒ రాష్ట్రంలో ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలను కలిపి చూస్తే వర్షపాతం సాధారణం నుంచి సాధారణం కంటే తక్కువగా కురుస్తాయని వివరించింది. 
⇒ రాష్ట్రంలోని ఉత్తర, ప శ్చిమ, దక్షిణ భాగాల్లో వర్షపాతం లోటుగా నమోదవుతుందని తెలిపింది. 
⇒ ఆగస్టులో తూర్పు, ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే కాస్త ఎక్కువగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.  
⇒ ప శ్చిమ, దక్షిణ భాగాల్లోని జిల్లాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. 
⇒ గరిష్ట ఉష్ణోగ్రతలు రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువగానే నమోదవుతాయని, ఈ నెలలో ఉక్కపోత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. 

5 శాతం లోటు వర్షపాతం... 
నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో సగటున లోటు వర్షపాతమే నమోదైంది. జూన్‌ 1 నుంచి జూలై 31 వర కు రాష్ట్రవ్యాప్తంగా 36.36 సెం.మీ. సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 34.39 సెం.మీ. కురిసింది. సగటు కంటే 5శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. రానున్న రెండు నెలల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించడంతో సీజన్‌ అంతా లోటులోనే ఉంటుందని తెలుస్తోంది. 
⇒ రాష్ట్రవ్యాప్తంగా మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో ఎక్కువ వర్షాలు కురిశాయి. 
⇒ రాష్ట్రంలోని 17 జిల్లాల్లో సాధారణ వర్షాలు నమోదు కాగా... 12 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. 

ఎక్కడ? ఎంత? 
⇒ సాధారణ వర్షపాతం: ఆదిలాబాద్, కుమ్రుంబీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, ములుగు. 
⇒ లోటు వర్షపాతం: భద్రాద్రి కొత్తగుడెం, మహబుబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి, మేడ్చల్‌–మల్కాజిగిరి, జోగులాంబ గద్వాల, వనపర్తి, సూర్యాపేట, ఖమ్మం, నారాయణపేట. 

⇒ జూన్‌లో 13.03 సెం.మీ. సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 11.53 సెం.మీ. వర్షం కురిసింది. సాధారణం కంటే 12శాతం తక్కువ వర్షాలు కురిశాయి. 
⇒ జూలైలో 22.74 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను 22.40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. (1 శాతం లోటు నమోదైంది(  
⇒ గతేడాది నైరుతి సీజన్‌ వర్షాలతో పోలిస్తే ఇప్పటివరకు 10శాతం తక్కువ వర్షాలే నమోదయ్యాయి.   

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)