27 లేదా 28 నుంచి అసెంబ్లీ సమావేశాలు?

Published on Sat, 12/20/2025 - 04:14

సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 27 లేదా 28వ తేదీన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమావేశాలను మూడు రోజులపాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలి సింది. ఇందుకోసం సీఎం అధ్యక్షతన ఈనెల 22న అనధికారిక మంత్రివర్గ సమావేశం జరగనున్నట్లు తెలిసింది. సచివాలయంలో మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీలను ప్రకటించడంతోపాటు ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశంపై కూడా స్పష్టతనివ్వను న్నట్లు సమాచారం.

అలాగే జిల్లా పరిషత్‌ ఎన్నికలకు ఎప్పుడు వెళ్లాలన్న అంశంతోపాటు, బీసీ రిజర్వేషన్ల అంశంపై మరోసారి చర్చించనున్నట్లు అధికారవర్గాల సమాచారం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలన్న దానిపై మరోసారి అసెంబ్లీలో చర్చించి.. అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. 42 శాతం రిజర్వేషన్ల అంశం ఇప్పటికే న్యాయస్థానం పరిధిలో ఉన్నందున, తీర్పు వచ్చేవరకు వేచి ఉండటమా..? లేక రాజకీయ పార్టీల నిర్ణయం తీసుకుని జెడ్పీ ఎన్నికల్లో ముందుకు వెళ్లడమా అనే దానిపై చర్చించనున్నారు.

కాగా, గత అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత తెచ్చిన మొత్తం ఏడు ఆర్డినెన్స్‌ల స్థానంలో అసెంబ్లీలో ఆయా బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. అందులో రెండు జీహెచ్‌ఎంసీ చట్ట సవరణలు, అలాగే మున్సిపాలిటీల చట్ట సవరణ, ప్రభుత్వ ఉద్యోగుల నియామకం.. వేతనాల చట్ట సవరణ, కాంట్రాక్టు, పార్ట్‌టైమ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన సవరణ బిల్లు, తెలంగాణ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ బిల్లు, ప్రైవేట్‌ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లులను అసెంబ్లీలో చర్చించి ఆమోదించనున్నారు. ప్రభుత్వం తాజాగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పాలక మండళ్లను రద్దు చేసిన నేపథ్యంలో సోమవారం జరిగే అనధికార మంత్రివర్గ సమావేశంలో వీటికి ఎన్నికల నిర్వహణపై కూడా చర్చించనున్నట్లు తెలిసింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)