Breaking News

ఎన్నికల వేళ: ఊరికెళుతూ బంగారం, డబ్బు తీసుకెడితే పరిస్థితి ఏంటి?

Published on Fri, 10/20/2023 - 12:15

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో ఒక వ్యక్తి సగటున రూ.50 వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లే అవకాశం ఉండదు. నిర్దేశించిన మొత్తం కంటే పైసా ఎక్కువున్నా అందుకు సంబంధించిన ఆధారాలను అధికారులకు చూపించాలి. లేకుంటే సదరు నగదును సీజ్‌ చేస్తారు. పక్కా ఆధారాలను చూపించినప్పుడు ఆ డబ్బును రిలీజ్‌ చేస్తారు.  పరిమితికి మించి తీసుకెళితే ఎలాంటి పత్రాలను చూపించాలనే దానిపై   స్పష్టత  కావాలని ఎన్నికల అధికారిని కోరిన ఎఫ్‌జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: యాభై వేలకు పైగా డబ్బు తీసుకెళ్తున్నప్పుడు ఎలాంటి రుజువు పత్రాలు ఉండాలో తెలపాలని ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ).. ఎన్నికల అధికారిని కోరింది. బంగారం ఎంత పరిమితిలో తీసుకెళ్లాలో వివరించాలని, దానికి ఎలాంటి ఆధార పత్రాలుండాలో తెలపాలని పేర్కొంది.

ఈమేరకు గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఎఫ్‌జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల సంఘం గైడ్‌లైన్స్‌ ప్రకారం పట్టుకున్న బంగారం, డబ్బును కమిటీతో విచారించి 48 గంటల్లో తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ప్రజలు, వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో వైన్‌షాపుల యాజమానులు డబ్బులను డిపాజిట్‌ చేసే క్రమంలో పట్టుకుంటున్నారని వెల్లడించారు.

పండగలు, పెళ్ళిళ్ళ సీజన్‌లో నగదును తీసుకెళ్తారని, వంశపారంపర్యంగా వచ్చిన ఆభరణాలకు రశీదులుండవని పద్మనాభరెడ్డి అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల నిబంధనల పేరుతో ప్రజలను, వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దని, వీటిపై పోలీసులు, కింది స్థాయి అధికారులకు తగిన సూచనలు, సలహాలివ్వాలని తెలిపారు. నేరస్తులను పట్టుకోవాలని, అమాయకులను ఇబ్బంది పెట్టొద్దని సీఈవోను కోరారు.

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)