Breaking News

బాలయ్య దంచుడుపై మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్

Published on Sat, 03/22/2025 - 16:24

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ అసెంబ్లీలో మీడియాతో చిట్‌ఛాట్‌ సందర్భంగా.. సినిమాటోగ్రఫీ శాఖ, రోడ్లు భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ నటుడు, ఏపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Bala Krishna)ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆయన రోజుకొకరినీ కొడతారంట కదా అని వ్యాఖ్యానించారు. 

బాలకృష్ణ రోజుకొకరిని కొడతారంట కదా. ఆయన సినిమాలు ఎవరు చూస్తారు? బాలయ్య కంటే రోజూ తనతోనే ఎక్కువమంది ఫొటోలు దిగుతారన్న కోమటిరెడ్డి.. అయినా ఆయన సినిమాలకు కలెక్షన్స్ వస్తాయట అంటూ మంత్రి కోమటిరెడ్డి చమత్కరించారు. మరోవైపు అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ వ్యవహరిస్తున్న తీరుపైనా ఆయన పలు విమర్శలు చేశారు. 

బీఆర్ఎస్ వాళ్లకు ధరణితో దోచుకుతినడం తప్పా ఏమి తెల్వదు. వాళ్లకు మాటలతోనే బతకడం అలవాటైంది. కేటీఆర్ తండ్రి చాటు కొడుకు. హరీష్ రావు మామ చాటు అల్లుడు. వాళ్లు కనీసం డిప్యూటీ లీడర్లు కూడా కారు. అలాంటప్పుడు మేం వాళ్లతో ఏం మాట్లాడతాం?. వేముల ప్రశాంత్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఆయన కేబినెట్‌లోనూ డమ్మీ మంత్రి ఉండే. ఆయనను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కనీసం గుర్తు కూడా పట్టరు అని కోమటిరెడ్డి అన్నారు. ఉప్పల్..నారపల్లి ఫ్లై ఓవర్ పనులపై ఇప్పటికే తాను కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడినట్లు తెలిపిన కోమటిరెడ్డి.. త్వరలో ఉస్మానియా ఆస్పత్రికి టెండర్లు కూడా పిలుస్తామని తెలిపారు.

యాగాల కామెంట్‌.. బీఆర్‌ఎస్‌ వాకౌట్‌
అంతకు ముందు.. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా శాసనసభలో ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణంలో జాప్యం విషయమై మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు.. ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం యాగాలు చేయడానికి ఇచ్చిన ప్రాధాన్యం రహదారుల అభివృద్ధికి కేటాయించలేదన్నారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోండి
కోమటిరెడ్డి వ్యవహారంపై శాసనసభా స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కలిశారు. ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేయాలని హరీష్‌రావు నేతృత్వంలోని బృందం స్పీకర్‌ను కోరింది. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉండి అన్ని అబద్ధాలే చెబుతూ సభను తప్పు దోవ పట్టిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను బీఆర్‌ఎస్‌ కోరింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)