Breaking News

ప్రణీత్‌రావు విచారణ కోసం స్పెషల్‌ టీం

Published on Wed, 03/13/2024 - 07:07

హైదరాబాద్‌‌, సాక్షి: తెలంగాణలో ప్రతిపక్ష నేతల ఫోన్‌‌ ట్యాపింగ్ కేసుతో వార్తల్లోకి ఎక్కిన స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు ఎట్టకేలకు అరెస్ట్‌ అయ్యారు.  అయితే.. ఈ కేసు విచారణ కోసం ఇప్పుడు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. జూబ్లీహిల్స్‌ ఏసీపీ నేతృత్వంలోని ఈ బృందం.. ప్రణీత్‌రావును విచారణ చేపట్టి.. ఆ వివరాలతో సహా ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.   

ఇదిలా ఉంటే.. ప్రణీత్‌రావును మంగళవారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలోనే పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రికిరాత్రి ఆయన్ని హైదరాబాద్​కు తరలించారు. ఇక.. ఎస్‌‌‌‌ఐబీ లాగర్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌లో హార్డ్‌‌‌‌డిస్క్‌‌‌‌లు ధ్వంసం చేసిన తర్వాత నుంచి ప్రణీత్‌‌‌‌రావు పక్కా ప్లాన్‌‌‌‌తో వ్యవహరించినట్లు తెలిసింది. గత నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీఆర్‌‌‌‌బీలో రిపోర్ట్‌‌‌‌ చేశారు. అక్కడ జాయిన్ అయిన రెండు రోజులకే సిక్ లీవ్‌‌‌‌ పెట్టినట్లు సమాచారం. సస్పెన్షన్​కు వారం రోజుల ముందు నుంచే డీసీఆర్‌‌‌‌బీకి వెళ్లలేదని సమాచారం. సిరిసిల్ల హెడ్‌క్వార్టర్‌ను విడిచి వెళ్లరాదని సస్పెన్షన్‌ ఉత్తర్వుల్లో పేర్కొనప్పటికీ ఆయన తప్పించుకుని తిరుగుతున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే ప్రణీత్‌‌‌‌రావు కోసం శ్రీనగర్ కాలనీలోని ఇంటి వద్ద పోలీసులు నిఘా పెట్టారు.

ఇదీ చదవండి: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నాడు.. ప్రణీత్‌రావు చేసిన నిర్వాకమిది!

మంగళవారం రాత్రి ప్రణీత్ రావు ఇంటికి వచ్చిన విషయం గుర్తించి దాడి చేసి, ఆయనను అరెస్టు చేశారు. ఆయన వద్ద ఉన్న సెల్ ఫోన్లను సీజ్ చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రణీత్​రావును హైదరాబాద్‌​కు తరలించారు. స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన అనంతరమే ఆయన్ని నాంపల్లి కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. 

ఎస్‌ఐబీలో కీలక సమాచారాన్ని ధ్వంసం చేశారనే ఆరోపణలపై.. ఎస్‌‌ఐబీ అడిషనల్ ఎస్పీ రమేశ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదైన సైతం అయ్యింది.  అంతకు ముందు.. ఆయన పోలీసుల అదుపులోనే రహస్య ప్రదేశంలో ఉన్నారని.. విచారణ జరుగుతోందన్న ప్రచారం నడిచింది. అయితే ప్రణీత్‌ రావు కోసం రెండ్రోజులుగా పంజాగుట్ట పోలీసులు సిరిసిల్లలోనే మకాం వేసినట్లు ఇప్పుడు తేలింది. ప్రణీత్‌రావుతో పాటు ఆయనకు సహకరించిన పలువురు అధికారుల్ని సైతం ప్రత్యేక టీం విచారణ చేపట్టే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు