Breaking News

మూడు రాష్ట్రాల సరిహద్దులో ‘మావో’ల భేటీ?

Published on Wed, 05/03/2023 - 04:00

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ ఆధ్వర్యంలో మావోయిస్టులు మూడు రాష్ట్రాల సరిహద్దులో భేటీ అయ్యారా? ములుగు, కొత్తగూడెం జిల్లాలకు సరిహద్దుగా ఉన్న వీరాపూర్‌ సమీపంలో మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఏరియా కమిటీల సమావేశం నిర్వహించారా? అంటే.. అవుననే అంటున్నాయి పోలీసు ఇంటెలిజెన్స్‌ వర్గాలు. సమావేశాలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు మావోయిస్టు నేత దామోదర్‌ ఆదేశాల మేరకు నిర్వహించారా..? లేక దామోదర్‌ సమక్షంలోనే సమావేశాలు జరిగాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. 

ఆ పోలీస్‌ స్టేషన్‌లో ఖాకీబాస్‌ల సమావేశం? 
మూడు రాష్ట్రాల సరిహద్దులో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలైన నేపథ్యంలో తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు ములుగు జిల్లా అటవీ ప్రాంతాలపై దృష్టి సారించారు. ఇంటెలిజెన్స్, ఇన్వెస్టిగేషన్‌ అధికారి ప్రభాకర్‌ రావు, అడిషనల్‌ డీజీ, ఇంటెలిజెన్స్‌ ఐజీలు నాగిరెడ్డి, రవివర్మలు, నార్త్‌జోన్‌ ఐజీ చంద్రశేఖర్‌లతోపా టు సీఆర్పీఎఫ్‌ చీఫ్, ఇతర పోలీస్‌ ఉన్నత అధికారులతో వెంకటాపురం పోలీస్‌ స్టేషన్‌లో సమావేశమయ్యారు.

ఈ క్రంలో అక్కడ భారీగా సీర్పీఎఫ్‌ బలగాలు మోహరించా యి. వెంకటాపురం, పాలం ప్రాజెక్టు, పెనుగోలు, కొత్తపల్లి, బీజాపూర్‌ ప్రాంతాల్లో పరిస్థితులపై ఆరా తీశారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల నిఘాను పర్యవేక్షించిన అ«ధికారులు డ్రోన్‌లను ఎగురవేసి పరిస్థితిని పరిశీలించినట్లు తెలిసింది. మావోయిస్టులు తెలంగాణలోకి చొరబడకుండా ముందస్తు చర్య ల్లో భాగంగా పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం 3 రాష్ట్రాల సరిహద్దులో పర్యటించినట్లు తెలిసింది. 

మూడు రాష్ట్రాల సరిహద్దులో హై అలర్ట్‌.. 
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల సరిహద్దులో పోలీసులు మళ్లీ హై అలర్ట్‌ ప్రకటించారు. సుమారు ఏడాదిన్నర తర్వాత 50 కిలోల శక్తివంతమైన మందుపాతర పేల్చి 10 మంది డీఆర్‌జీ (డి్రస్టిక్ట్‌ రిజర్వ్‌డ్‌ గ్రూప్‌) జవాన్లు, డ్రైవరును చంపిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా లో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పుల్లో ఓ దళకమాండర్, ఇద్దరు సభ్యలు మృతి చెందారు.

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు మూడు రాష్ట్రాల సరిహద్దు అటవీప్రాంతాన్ని మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు. తెలంగాణ సరిహద్దులోని ఏజెన్సీలోకి మావోలు చొరబడే అవకాశం ఉందనే సమాచారంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)