Breaking News

తెలంగాణ హౌసింగ్‌ బోర్డుకు సుప్రీంకోర్టు అల్టిమేటం

Published on Fri, 11/06/2026 - 17:09

సాక్షి,హైదరాబాద్: తెలంగాణ హౌసింగ్‌ బోర్డు ఇళ్ల రిజిస్ట్రేషన్ల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారుల ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని అత్యున్నత న్యాయస్థానం హౌసింగ్ బోర్డును ఆదేశించింది. ఈనెల 23వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టమైన డెడ్‌లైన్ విధించింది.

లబ్ధిదారుల ఇళ్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రక్రియలను ఈ నెల 23వ తేదీలోపు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ లబ్ధిదారులు లేదా హౌసింగ్ బోర్డు ఈ ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర వ్యక్తులకు విక్రయించడానికి, బదిలీ చేయడానికి వీల్లేదని కోర్టు స్పష్టమైన షరతు విధించింది. ఈ కేసులో తుది తీర్పు వెలువడే వరకు ఎలాంటి మూడో పక్షానికి ఎలాంటి హక్కులు కల్పించవద్దని న్యాయస్థానం ఆదేశించింది.

తెలంగాణ హౌసింగ్‌ బోర్డు ద్వారా గతంలో ఇళ్లు పొందిన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లు పూర్తి కాకపోవడం,దీనికి సంబంధించి వివిధ కోర్టుల్లో కేసులు నడుస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. 

ఒకవైపు లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని ఆదేశిస్తూనే, మరోవైపు కేసు అంతిమ తీర్పు వచ్చే వరకు ఆస్తుల క్రయవిక్రయాలపై నియంత్రణలు విధించడం ద్వారా వివాదాలకు తావు లేకుండా న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఊరట లభించినట్టయింది.

ఇదీ వివాదం..
తెలంగాణ హౌసింగ్‌ బోర్డు చేపట్టిన వివిధ ప్రాజెక్టులలో సుమారు దశాబ్దానికి పైగా  పలు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.  దాదాపు 10 నుంచి 15 ఏళ్ల క్రితమే లబ్ధిదారులు ఫ్లాట్లను బుక్‌ చేసుకున్నారు.  కొనుగోలుదారుల ఒప్పందం ప్రకారం 2011 నాటికే చాలామంది తమ వంతు పూర్తి డబ్బులను బోర్డుకు చెల్లించారు. అయితే హౌసింగ్‌ బోర్డు, నిర్మాణ డెవలపర్ల మధ్య వివాదాలు, థర్డ్‌ పార్టీ లావాదేవీల వల్ల బోర్డు లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లు పూర్తి చేయకుండా కాలయాపన చేస్తూ వచ్చింది. 

ఇప్పుడు ఇదే కేసులో సుప్రీం..  పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారుల ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని అత్యున్నత న్యాయస్థానం హౌసింగ్ బోర్డును ఆదేశించింది. ఈనెల 23వ తేదీని డెడ్‌లైన్‌గా విధించింది. 

ఇదీ చదవండి : ‘స్థానిక’ కుట్రలపై సుప్రీం కొరడా! 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)