Breaking News

‘మెట్రో’ విస్తరణ మ్యాప్‌ సమర్పించండి

Published on Fri, 11/07/2025 - 05:21

సాక్షి, హైదరాబాద్‌: మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌ నుంచి శంషాబాద్‌ వరకు చేపడుతున్న మెట్రో రైలు విస్తరణ పనుల మ్యాప్‌ను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎక్కడి నుంచి ఎక్కడికి.. ఎన్ని కిలోమీటర్లు.. ఆయా మార్గాల్లోని చారిత్రక కట్టడాలు.. ఇలా అన్ని వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 18కి వాయిదా వేసింది. ఎంజీబీఎస్‌ నుంచి శంషాబాద్‌ వరకు మెట్రోరైలు విస్తరణ పనులతో చారిత్రక కట్టడాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని.. అందువల్ల పనులు ఆపేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ‘పిల్‌’దాఖలైంది.

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఇమ్మనేని రామారావు వాదనలు వినిపిస్తూ ‘మెట్రో రైలు అథారిటీ తప్ప ఇప్పటివరకు ఎవరూ కౌంటర్‌ దాఖలు చేయలేదు. 10 నెలలుగా సమయం తీసుకుంటూనే ఉన్నారు. మెట్రో విస్తరణతో పరిసర ప్రాంతాల్లోని చారిత్రక కట్టడాలపై ప్రభావం పడుతోంది. చార్మినార్, ఫలక్‌నుమా, దారుల్‌íÙఫా లాంటి కట్టడాలకు ప్రమాదం వాటిల్లనుంది. వాటి రక్షణకు చర్యలు తీసుకోలేదు.

దీనిపై పురావస్తు శాఖ, పర్యావరణ, ఆయా రంగాల నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి. చారిత్రక, స్మారక చిహ్నలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’ అని చెప్పారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌(ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్‌ వాదిస్తూ ‘చారిత్రక కట్టడాలకు నష్టం వాటిల్లకుండా నిర్మాణం కొనసాగుతోంది.

ఇది ప్రచారం కోసం వేసిన పిటిషనే. ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7 కి.మీ. మేర పిల్లర్ల ఫుట్‌వర్క్‌ నడుస్తోంది’ అని తెలిపారు. పురావస్తు నిర్మాణాలను తాకేలా మెట్రో వెళ్లట్లేదని.. కూల్చివేతలేవీ ఉండవని ఏప్రిల్‌లో హెచ్‌ఎండీఏ, హైదరాబాద్‌ హెరిటేజ్‌ కన్జర్వేషన్‌ కమిటీ, హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో లిమిటెడ్‌ కోర్టుకు హామీ ఇచి్చన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. దీనిపై కౌంటర్‌ వేయడంతోపాటు నిర్మాణ మ్యాప్‌ను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)