Breaking News

ఏంటో నా జీవితం... పిచ్చిలేస్తోంది

Published on Sun, 01/05/2025 - 13:00

శామీర్‌పేట్‌: ‘నాకు ఏమీ రావు.. ఏంటో నా జీవితం.. పిచ్చిలేస్తుంది.. అసలు లైఫ్‌ మొత్తం ఇలానే ఉంటుందా.. నాకు చనిపోవాలనిపిస్తుంది’ అంటూ స్కూల్‌ నోట్‌ బుక్‌లో సూసైడ్‌ నోట్‌ రాసి ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన జీనోమ్‌ వ్యాలీ పోలీస్‌స్టేషన్‌ పరిధి తుర్కపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. 

ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నాగ వెంకటరమణ–లక్ష్మి దంపతులు 15 ఏళ్ల క్రితం తుర్కపల్లికి వలస వచ్చి ఉమాశంకర్‌ రైస్‌మిల్‌లో కారి్మకులుగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. వీరి కూతురు తేజస్విని సాయిదుర్గాలక్ష్మి (16) గ్రామంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. ఈ నెల 3న తలనొప్పిగా ఉందని తేజస్విని స్కూల్‌కు వెళ్లలేదు. రాత్రి కుటుంబమంతా కలిసి భోజనం చేసి నిద్రించారు. 

శనివారం ఉదయం 6.30 గంటల సమయంలో తల్లి లక్ష్మి బాత్‌ రూంకు వెళ్లగా తేజస్విని బాత్‌రూంలో చీరతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న జీనోమ్‌ వ్యాలీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దర్యాప్తులో స్కూల్‌ నోట్‌ బుక్‌లో సూసైడ్‌ నోట్‌ గుర్తించారు. కాగా తేజస్విని అతిగా నిద్రించేదని, తల్లిదండ్రులు మందలించడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు