Breaking News

శ్రీవాణి ఆత్మహత్యకు ఫొటోనే కారణమా..

Published on Tue, 07/01/2025 - 13:37

పరకాల: ఓ పదో తరగతి విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్‌పేట శివారులోని తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో సోమవారం జరిగింది. పరకాలకు చెందిన ఏకు ఈశ్వర్‌–నీల కుమార్తె శ్రీవాణి ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం బాత్రూమ్‌కు వెళ్లింది. చాలాసేపటి వరకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితురాళ్లు ప్రిన్సిపాల్‌ కృష్ణకుమారికి తెలిపారు. ఆమె వచ్చి బాత్రూం డోర్‌ను బలవంతంగా తీయడంతో శ్రీవాణి చున్నీతో ఉరివేసుకుని కనిపించింది.

 వెంటనే ఆమెను పరకాల సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. శ్రీవాణి బాత్రూంలో జారిపడిందని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన ఆస్పత్రికి వచ్చారు. అప్పటికే బాలిక చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు భోరుమని విలపించారు. తమ కుమార్తె చావుకు కారణం తెలపాలంటూ రెసిడెన్షియల్‌ ముందు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్‌ కృష్ణకుమారి, హౌజ్‌మాస్టర్‌ మీరాబాయి వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఆత్మహత్యకు ఫొటోనే కారణమా..  
వారం క్రితమే రెసిడెన్షియల్‌లో చేరిన శ్రీవాణి వద్ద ఓ ఫొటోను చూసిన హౌస్‌ టీచర్‌ బలవంతంగా లాక్కున్నట్లు తెలిసింది. తర్వాత విద్యార్థిని సదరు టీచర్‌ తాళం చెవి కనుక్కొని లాకర్‌ ఓపెన్‌ చేసి ఫొటో తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయగా.. విద్యార్థినుల సమక్షంలోనే శ్రీవాణిని నోటికి వచి్చనట్లు తిట్టి.. చావచ్చు కదా అన్నట్లు సమాచారం. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ప్రిన్సిపాల్‌  ఆటోలో విద్యారి్థని మృతదేహాన్ని తరలించడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకొని పరకాల పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. 

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)