Breaking News

Car Accident: బీబీఏ విద్యార్థి దుర్మరణం 

Published on Sat, 08/03/2024 - 07:53

రాయదుర్గం: మితిమీరిన వేగంతో కారును నడిపిన బీబీఏ విద్యార్థి అసువులు బాశాడు. కారు వేగం నియంత్రణలోకి రాకపోవడంతో ఎడమవైపు టర్న్‌ కాకుండా ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్‌ను ఢీకొని  అతడు అక్కడికక్కడే దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం తెల్లవారుజామున రాయదుర్గం పరిధిలో చోటుచేసుకుంది. 

 ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న చెప్పిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడలోని రహమత్‌నగర్‌కు చెందిన గోవుల చరణ్‌ (19) తల్లి చనిపోవడంతో తాత, మేనమామతో కలిసి ఉంటున్నాడు. శంకర్‌పల్లిలోని ఐబీఎస్‌ కళాశాలలో బీబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున ఇప్పుడే వస్తానంటూ షిఫ్ట్‌ డిజైర్‌ కారులో ఇంటి నుంచి బయలుదేరాడు. బీఎన్‌ఆర్‌ హిల్స్‌ నుంచి టోలిచౌకీ వైపు వెళుతూ రాయదుర్గం కూడలిలోకి వచ్చాడు. అప్పుడు తెల్లవారుజాము 3.52 గంటలు అవుతోంది.

 ఆ సమయంలో కారు మితిమీరిన వేగంతో అదుపుతప్పింది. ఎడమ వైపు మళ్లకుండా ఎదురుగా ఉన్న రాయదుర్గం ఫ్లైఓవర్‌ను ఢీకొట్టింది. 70 శాతానిపైగా నుజ్జునుజ్జయింది. డ్రైవింగ్‌ చేస్తున్న చరణ్‌ తీవ్ర గాయాలతో కారులోనే మృతి చెందాడు. కారు ముందు భాగం ముద్దగా మారిన పరిస్థితి చూస్తే దాని వేగం ఎంతగా ఉందో అ«ర్థం చేసుకోవచ్చు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారులోని చరణ్‌ మృతదేహన్ని బయటికి తీసి పోస్టుమార్టమ్‌ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)