Breaking News

హిందూ వివాహ చట్టప్రకారం ఎస్టీలు విడాకులు ఇవ్వొచ్చు

Published on Wed, 05/29/2024 - 04:34

సాక్షి, హైదరాబాద్‌: హిందూ వివాహ చట్టప్రకారం వివాహం చేసుకున్న ఎస్టీలకు అదే చట్టప్రకారం విడాకులు ఇవ్వవచ్చని.. అయితే పెళ్లికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. కామారెడ్డి జిల్లా నస్రూలాబాద్‌ మండలానికి చెందిన ఓ గిరిజన (లంబాడ) దంపతులు పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ కామారెడ్డి సివిల్‌ కోర్టును ఆశ్రయించారు. 

ఎస్టీకి చెందిన వారికి హిందూ వివాహ చట్టం సెక్షన్‌ 2(2) వర్తించదని కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. దీనిపై దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ అలిశెట్టి లక్ష్మీనారాయణ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది సృజన్‌కుమార్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్లు పూర్తిగా హిందూ వివాహ చట్ట ప్రకారం వివాహం చేసుకున్నారని.. పెళ్లి కార్డు సహా ఇతర ఆధారాలన్నీ పరిశీలించాల్సిన ట్రయల్‌ కోర్టు ఆ పని చేయలేదన్నారు. 

హిందూ లంబాడా వర్గానికి చెందిన వారని.. హిందూ వివాహ చట్టం వారికి వర్తించకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లు లంబాడా వర్గానికి చెందిన వారైనా వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగినందున ట్రయల్‌ కోర్టు పూర్తి ఆధారాలను పరిశీలించి ఆ మేరకు విడాకులు ఇవ్వవచ్చని స్పష్టం చేశారు.

అయితే హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 2(2).. ఇతర సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్న ఎస్సీలకు వర్తించదని, ఈ కేసుకు మాత్రమే పరిమితమని చెప్పారు. ట్రయల్‌ కోర్టు నిర్ణయాన్ని కొట్టివేస్తున్నామన్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)