Breaking News

Hyderabad: విషాదం.. చిన్నారిని బలిగొన్న వీధి కుక్కలు

Published on Fri, 02/02/2024 - 17:43

శంషాబాద్‌: హైదరాబాద్‌లో మరో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఏడాది వయసున్న చిన్నారి మృతి చెందింది. ఈ హృదయ విదారక సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మున్సిపాలిటీ ప్రాంతంలో చోటుచేసుకుంది.

శంషాబాద్‌ ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారానికి చెందిన సూర్యకుమార్‌, యాదమ్మ దంపతులు  బతుకుదెరువు కోసం శంషాబాద్‌కు వలస వచ్చారు. అయితే వారు రాళ్లగూడ సమీపలోని ఓ గుడిసెలో తమ ఏడాది వయసున్న కుమారుడు నాగరాజుతో కలిసి నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం యాదమ్మ నిండు గర్భిణి కావటంతో ఆమెను స్థానిక  ఆస్పత్రిలో చేర్చారు.

బుధవారం రాత్రి చిన్నారి పాల కోసం ఏడవగా తండ్రి ఆ చిన్నారికి పాలు తాగించి నిద్రపుచ్చాడు. తెల్లవారుజామున ఆ చిన్నారి మళ్లీ ఏడుస్తూ గుడిసె బయటకు రాగా రోడ్డుమీద ఉన్న వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. అక్కడి నుంచి వస్తున్న శబ్దాలను విన్న పలువురు వాహనదారులు పల్లాడిపై దాడి చేస్తున్న కుక్కలను తరిమేశారు. వారు చిన్నారిని పరిశీలించగా.. అప్పటికే మృతి చెందాడు. ఈ దంపతులకు పుట్టిన ఇద్దరు పిల్లలు ఇప్పటికే మృతి చెందగా.. మరో చిన్నారి వీధి కుక్కలు బలితీసుకోవంటంతో బోరున విలపిస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)