Breaking News

ప్రజాభవన్‌లో బాంబు కలకలం

Published on Wed, 05/29/2024 - 05:14

పంజగుట్ట: ‘‘ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో బాంబు పెట్టాం.. మరో కొద్దిసేపట్లో అది పేలబోతుంది..’’ అంటూ ఒక అగంతకుడు పోలీస్‌ కంట్రోల్‌రూం డయల్‌ 100కు ఫోన్‌ చేసి చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా ఉరుకులు పరుగులు పెట్టారు. సుమారు నాలుగు గంటలపాటు మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌ మొత్తం తనిఖీ చేసి ఎలాంటి బాంబు లేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. 

పోలీసుల కథనం మేరకు.. మంగళవారం మధ్యాహ్నం 12:06 నిమిషాలకు పోలీస్‌ కంట్రోల్‌రూం 100కు ఓ అగంతకుడు ఫోన్‌ చేసి  ప్రజాభవన్‌లోని మల్లు భట్టి విక్రమార్క ఇంటివద్ద బాబు పెట్టామని ఫోన్‌ చేశాడు. కంట్రోల్‌రూం సిబ్బంది 12:15కు పంజగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇంటలిజెన్స్‌ సెక్యురిటీ వింగ్, సిటీ సెక్యురిటీ వింగ్‌ అధికారులను రంగంలోకి దింపారు. హుటాహుటిన నాలుగు డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు, 10 బాంబ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్స్‌ బృందాలు రంగంలోకి దిగాయి. పంజగుట్ట ఏసీపీ మోహన్‌ కుమార్‌ నేతృత్వంలో అణువణువూ తనిఖీ చేశారు.

ఇకపై అక్కడ భారీ బందోబస్తు..: భట్టి ఇంటితోపాటు మంత్రి సీతక్క ఇంటిని, పరిసర ప్రాంతాలనూ చెక్‌ చేశారు. తరువాత ప్రజాభ­వన్‌ లోపల, పక్కనే ఉన్న మరోభవనం, అమ్మవారి ఆలయం సహా అన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సుమారు 4 గంటలకు పైగా తనిఖీలు చేసి ఎక్కడా ఏమీ లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 

ఇకపై ప్రజాభవన్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు.. సందర్శకులను క్షుణంగా పరిశీలించాలని సిబ్బందికి ఆదేశించారు. కాగా, ప్రజాభవన్‌లో బాంబు ఉందని ఫోన్‌ చేసిన వ్యక్తి గురించి పోలీసులు గాలిస్తున్నారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి