Breaking News

చిటపట.. గజగజ..

Published on Thu, 01/23/2025 - 04:27

రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితి.. పగలంతా ఉక్కపోత.. రాత్రయితే వణికిస్తున్న చలి.. కనిష్ట ఉష్ణోగ్రతలు పతనం కావడం, చలిగాలుల ప్రభావంతో వాతావరణం వేగంగా చల్లబడుతోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.  

 సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలంతా అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కపోతగా ఉంటే.. రాత్రిపూట గజగజమంటూ చలి వణికిస్తోంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం, కొన్నిప్రాంతాల్లో అంతకు మించి నమోదవుతుండగా.. కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణంకంటే తక్కువగా నమోదవుతున్నాయి. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 1 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ వర కు అధికంగా నమోదు కాగా.. కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం 5 డిగ్రీల సెల్సియస్‌ తక్కువగా నమోదయ్యాయి. 

బుధవా రం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత మహబూబ్‌నగర్‌లో 34.1 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 10.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడంతో జనజీవనం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ మార్పులు అనారోగ్య సమస్యలకు దారితీస్తాయ ని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని  వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే 4 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా గరిష్ట ఉష్ణో గ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం భారీ వ్యత్యాసంతో నమోదయ్యాయి. మెదక్‌లో సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతకంటే 5 డిగ్రీల సెల్సియస్‌ తక్కువగా నమోదు కాగా, హైదరాబాద్, రామగుండంలో 3డిగ్రీల సెల్సియస్‌ తక్కువగా నమోదైంది.

రాష్ట్ర ప్రణాళికా విభా గం వివరాల ఆధారంగా కనిష్ట ఉష్ణోగ్రత కోహి ర్‌లో 6.9 డిగ్రీలుగా నమోదైంది. రానున్న 3 రోజులు కూడా రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువ గా నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారు లు అంచనా వేస్తున్నారు.  

ఈసారే ఎందుకిలా?
రాష్ట్రానికి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో చలిగాలులు వీస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు పతనం కావడం, చలిగాలుల ప్రభావంతో వాతావరణం వేగంగా చల్లబడుతోంది. భౌగోళికంగా రాష్ట్రం దక్కన్‌ పీఠభూమిలో ఎత్తైన ప్రాంతంలో ఉండటంతో ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గడం, పెరగడం జరుగు తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా చలికాలంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే తక్కువగా నమోదవుతుంటాయి. 

ప్రస్తుతం తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి బలమైన చలిగాలులు వీస్తుండడంతో చలి తీవ్రత పెరిగింది. గతేడాది రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదు కాగా.. ఈ ఏడాది మాత్రం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)