Breaking News

శస్త్రచికిత్సలకు 3 నెలలపాటు ఎదురుచూపులు

Published on Tue, 07/29/2025 - 18:07

హైద‌రాబాద్‌: అది ఆసియాలోనే పేరున్న ఆసుపత్రి.. నిష్ణాతులైన వైద్యులకు నిలయం.. శస్త్రచికిత్సలకు ప్రసిద్ధి. కానీ, ఇటీవల వైద్యులు, ఫార్మసిస్టుల కొరత పీడిస్తోంది. ఉన్న సిబ్బందిపై పనిభారం తీవ్రమైంది. శస్త్ర చికిత్సలకు కనీసం మూడు నెలలపాటు వేచి చూడాల్సిందే. ఇదీ కోఠి ఈఎన్‌టీ (ముక్కు, చెవి, గొంతు) ఆసుపత్రి పరిస్థితి. కొంతకాలంగా వైద్యులు, ఫార్మసిస్టులు, నర్సులు, సిబ్బంది కొరత కారణంగా రోగులకు సరైన వైద్యం అందడం లేదు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో నిష్ణాతులైన వైద్యులు ఇతర ఆసుపత్రులకు బదిలీ కావడంతో ఇక్కడ ప్రతినిత్యం జరిగే శస్త్రచికిత్సలకు తీవ్ర జాప్యం ఏర్పడుతోంది.  

రోజూ వెయ్యిమందికిపైగా ఓపీ రోగులు
తెలంగాణ (Telangana) నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎంతో మంది రోగులు ఈ ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలు పొందుతారు. ఈ ఆసుపత్రికి ప్రతి రోజు వెయ్యి నుంచి 1300 మంది ఔట్‌ పేషెంట్లు వస్తున్నారు. 200 నుంచి 300 వరకు ఇన్‌ పేషంట్లు వివిధ యూనిట్లలో చికిత్సలు పొందుతుంటారు. ఇటీవల కాలంలో ఓపీ రోగులు పెరుగుతుండటంతో సరైన వైద్య సేవలు అందటంలేదు. బదిలీలు అయిన వైద్యుల స్థానంలో కొత్తవారిని ప్రభుత్వం నియమించకపోవడంతో ఈ ఆసుపత్రిలో వైద్యం అంతంత మాత్రమే ఉంది.  

తీవ్రంగా వైద్యుల కొరత..  
కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో మొత్తం ఐదు మంది ప్రొఫెసర్లు ఉండాలి. ఇటీవల ముగ్గురు ప్రొఫెసర్లు బదిలీ కావడంతో ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఐదుగురు అసోసియేట్‌ ప్రొఫెసర్లకుగాను ఇద్దరు బదిలీకావడంతో ముగ్గురే సేవలందిస్తున్నారు. 14 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకుగాను నలుగురు మాత్రమే ఉన్నారు. వైద్యుల కొరత కారణంగా రోగులకు అవసరమైన శస్త్ర చికిత్సలు సకాలంలో అందడంలేదు. నెలలపాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఈ విషయమై పలుమార్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రభుత్వానికి నివేదికలు పంపినా ఫలితం శూన్యమని చెప్పవచ్చు. కేవలం ఒక ఫార్మసిస్టు మాత్రమే వందల మంది రోగులకు మందులు అందిస్తున్నారు. దీంతో ఆ ఫార్మసిస్టుపై పనిభారం ఎక్కువై ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఫార్మసిస్టును వెంటనే భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు.  

మందులతోనే సరి..
వివిధ జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చే రోగులకు సరైన సమయంలో వైద్యం అందక పోవడంతో వారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఔట్‌  పేషెంటు రోగులకు పీజీ వైద్యులు కేవలం మందులు రాసి సరిపెడుతున్నారు. ఒక్కప్పుడు ఇదే ఆసుపత్రిలో ప్రతి రోజు 20 నుంచి 30 శస్త్ర చికిత్సలు జరిగేవి. ఇప్పుడు శస్త్రచికిత్సలకు కనీసం మూడు నెలలు ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ ఆసుపత్రిలో సిబ్బందితో పాటు సరైన సౌకర్యాలు సైతం లేకపోవడంతో ఆసుపత్రి అధ్వానంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆసుపత్రికి సరైన వైద్యులు, ఫార్మసిస్ట్‌లు, నర్సింగ్‌ సిబ్బందిని సమకూర్చాలని పలువురు రోగులు కోరుతున్నారు.

చ‌ద‌వండి: హైద‌రాబాద్‌లో చిరుత పులి.. పక్షం రోజులు దాటినా దొరకని జాడ 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు