Breaking News

నా చెప్పులెక్కడ..?

Published on Wed, 06/04/2025 - 11:25

జగిత్యాల టౌన్‌: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్‌ క్యాంపులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మాతా శిశు ఆస్పత్రి నిర్వహణ విమర్శల పాలవుతోంది. చిన్నారుల తారుమారు, బెడ్స్‌ కేటాయించకుండా రోగులను నేలపై పడుకో బెట్టడం, ఓ రోగిని ఆస్పత్రి నుంచి బయటకు పంపడం, ఆస్పత్రికి వచ్చిన రోగులను ప్రైవేటుకు తరలించడం లాంటి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాతా శిశు ఆస్పత్రి సిబ్బంది.. రోగులను తరలించే స్ట్రెచర్‌పై చెప్పులు తరలిస్తూ మరో వివాదంలో చిక్కుకున్నారు. జగిత్యాల మాతాశిశు ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు చెప్పులు విప్పేందుకు సరైన షూ ర్యాక్స్, సెల్ఫులు, సరైన స్థలం కేటాయించలేదు. 

దీంతో రోగులు, వారి సహాయకులు, బంధువులు తమకు తోచిన చోట పాదరక్షలు విడిచి లోనికి వెళ్తున్నారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది వారి చెప్పులను స్ట్రెచర్‌పై తరలించి ఆస్పత్రి ఆవరణలో కుప్పలుగా పోస్తున్నారు. రోగులను పరామర్శించి వచ్చేసరికి చెప్పులు కనబడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు చెబుతున్నారు. ఆస్పత్రి ఆవరణలో పోసిన చెప్పులను కుక్కలు కొరికేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కాగా, రోగులను తరలించేందుకు వినియోగించే స్ట్రెచర్‌ను చెప్పులు తరలించేందుకు వినియోగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)