Breaking News

రోజుకు 15 మందిని చంపేస్తున్న అతివేగం

Published on Mon, 11/03/2025 - 11:07

హైదరాబాద్: ఇటీవల బెంగళూరు హైవేపై జరిగిన కర్నూలు బస్సు విషాదం మరువకముందే, రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో ఈరోజు (సోమవారం) మరో ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్‌ లారీ ఢీ కొట్టి బోల్తా పడిపోయింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని హైవేలపై ప్రతిరోజూ సగటున 15 మంది ‘అతివేగం’ కారణంగా మరణిస్తున్నారు. 2023లో రెండు రాష్ట్రాలలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై 5,500 మంది అతివేగం సంబంధిత ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయారు. తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాద మరణాలలో 30 శాతం మరణాలు అతివేగం కారణంగానే జరుగుతున్నాయి.

తెలంగాణలో 2020- 2023 మధ్య కాలంలో 25 వేల మందికి పైగా జనం అతివేగం కారణంగా సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో కన్నుమూశారు. అతివేగం వల్ల సంభవించే మరణాల విషయానికి వస్తే, దేశంలోనే తెలంగాణ ఏడవ స్థానంలో ఉంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా తదితర పెద్ద రాష్ట్రాల కంటే తెలంగాణ ముందు వరుసలో ఉంది. రోడ్డు ప్రమాదాలలో 80 శాతానికి మించిన ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమని రోడ్డు భద్రతా నిపుణులు చెబుతున్నారు.

వాహనాలు నడిపే విషయంలో స్పష్టమైన వేగ పరిమితులను నిర్ణయించాలని, రోడ్లపై కనిపించే విధంగా సంకేతాలను ఏర్పాటు చేయాలని  నిపుణులు కోరుతున్నారు. చాలా ప్రాంతాలలో, ముఖ్యంగా  మలుపులు, జంక్షన్ల వద్ద సరైన సూచికలు లేవని వారు అంటున్నారు. స్పీడ్ లేజర్ గన్‌లు తాత్కాలిక నిరోధకం మాత్రమేనని, మెరుగైన రోడ్డు డిజైన్, సరైన గుర్తులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: చేవెళ్లలో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)