Breaking News

రేవంత్ రావాలి.. నా లగ్గం జరగాలి

Published on Tue, 04/22/2025 - 19:30

బాబూ. గణేష్ .. పెళ్లి కుదిరిందట కదా.. మరి ముహుర్తాలు తీసారా.. ఎప్పుడట మరి.. అడిగారు ఊరి జనం.. ఏమో నాకూ తెలీదు.. చెప్పాడు గణేష్.. అదేందిరా అట్లా చెబుతావ్..  ఈనెల.. వచ్చేనెల.. ఆపై వచ్చేనెల ఏదో ఒక రోజు ఉంటుంది కదా.. అది చెప్పు .. రెట్టించి అడిగారు పెద్దలు.. ఏమో.. నాకేం తెలుసు.. ఆయనకు ఎప్పుడు ఖాళీదొరికితే అప్పుడే నా పెళ్లి.. ఓహో.. పురోహితుడు డేట్స్ కుదరలేదా.. అవునులే.. అసలే ఇప్పుడు పంతుళ్ళకు బిజీ ఉంది.. అయన తీరిక దొరికాక ఏదో డేట్ చెబుతాడు.. చేసుకుందువులే.. .. పురోహితుడు కాదు.. వేరే అయన డేట్స్ కుదరాలి.. ఓహో.. అర్థమైందిరా పిల్ల అన్నయ్య అమెరికాలో ఉన్నాడు ఆయనకు సెలవులు.. డేట్స్ దొరకలేదు.. అయన వస్తేగానీ పెళ్లి వద్దన్నారు ఆడపిల్లవాళ్ళు.. అయన వచ్చాకే చేసుకుందువులే.. అన్నారు పెద్దలు.. అది కాదు.. అన్నాడు గణేష్..  మరింకేందిరా.. ఇంకెవరి డేట్స్ కుదరాలి.. రేవంత్ రెడ్డి డేట్స్ కుదరాలి.. చెప్పాడు గణేష్.. వార్నీ.. అదేందిరా అన్నారు పెద్దలు.. అదంతే.. రేవంత్ రెడ్డి వస్తేనే నా పెళ్లి.. లేదంటే లేదు అంటుకుంటూ విసురుగా వీధిలోకి వెళ్ళిపోయాడు  కుర్రాడు..  

పెళ్లీడుకొచ్చిన కుర్రాళ్లను ఎవరైనా ఒరేయ్ అబ్బాయ్ నీ పెళ్లి ఎప్పుడురా అంటే ఇదిగో జాబ్ రాగానే చేసుకుంటాను.. ఇదిగో మా మరదలు ఒకే అనడమే లేటు.. అయ్యో.. ఇల్లు పని మధ్యలో ఉంది.. అది పూర్తయ్యాక బ్యాండ్ వాయించడమే.. జీతం తక్కువ ఉంది పెద్దయ్యా.. వచ్చే ఏడాది జీతం పెరగ్గానే చేస్కుంటా.. నువ్వే పిల్లను చూడు... నేనా అమెరికా వెళ్తున్న రెండేళ్లు అక్కడ ఉండి వస్తాను.. రాగానే చేసేసుకుంటా... లేదు బాబాయ్.. పిల్లలు దొరకడం లేదు.. పోనీ నువ్వైనా చూడు.. చేస్కుంటా.. అంటూ సమాధానాలు వస్తాయి.. కానీ ఈ కుర్రాడు మాత్రం.. నీ పెళ్లి ఎప్పుడురా అంటే షాకిచ్చే సమాధానం ఇచ్చాడు..  

ఎవరైనా ఎమ్మెల్యేను కలిసి సార్ నాకు ఉద్యోగం చూడండి.. లేదా మంత్రికి చెప్పి ఏదైనా కాంట్రాక్ట్ ఇప్పించండి.. ఇంకా పెద్దాయనకు చెప్పి నాకు మెడిసిన్ సీట్ ఇప్పించండి అని కోరుకుంటారు.. సదరు నాయకుడు కూడా తన కార్యకర్త మాటను గౌరవించి మున్ముందు తనకు ఉపయోగపడే తీరునుబట్టి రికమెండేషన్ చేస్తారు. కానీ ఇదిగో తెలంగాణలోని వైరా నియోజకవర్గానికి చెందిన భూక్యా గణేష్  అనే యూత్ నాయకుడు మాత్రం విచిత్రమైన కోరిక కోరాడు. తన పెళ్ళికి సీఎం    రేవంత్ రెడ్డి రావాల్సిందే అని పట్టుబట్టాడు.. 

అయన ఎప్పుడు వస్తే అప్పుడే పెళ్లి చేసుకుంటాను అని.. అప్పుడే ముహూర్తం ఫిక్స్ చేసుకుంటాను అని ఫిక్షయ్యాడు. దీంతో ఏకంగా ఎమ్మెల్యే రామ్ దాస్ మాలోత్ కు  ఒక లెటర్ రాసాడు.. ఇదిగో అన్నా.. నేను మీ నియోజకవర్గంలో  నాయకుణ్ణి  పెళ్ళికి మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని తీసుకొచ్చే బాధ్యత నీదే అంటూ.. ఒక విజ్ఞాపన అందించాడు.. దాన్ని సదరు ఎమ్మెల్యే  సీఎం కు ఫార్వార్డ్ చేసాడు..  మా    ఊరి కుర్రాడికి పెళ్లి కుదిరింది.. మీరైతే రావాల్సిందే.. రాకుంటే నాకు ఇజ్జత్ పోయేలా ఉంది.. ఏదైనా చేసి రండి సారూ అంటూ ఆ ఎమ్మెల్యే కూడా సీఎం కు ఆ లెటర్ పంపాడు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పుడు డేట్స్ కుదురుతాయో.. భూక్యా గణేష్ పెళ్ళికి.. ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ అవుతుందో చూడాలి.
-సిమ్మాదిరప్పన్న 

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)