Breaking News

వాక్‌ టు వర్క్‌

Published on Tue, 12/09/2025 - 01:58

సాక్షి, హైదరాబాద్‌: నడుచుకుంటూనే ఆఫీసుకు వెళ్లొచ్చు.. వీకెండ్‌ వస్తే కుటుంబంతో కలిసి ఇంటికి దగ్గర్లోనే సినిమాకో, షికారుకో వెళ్లి ఎంజాయ్‌ చేయొచ్చు. వైద్య సేవలూ ఇంటికి చేరువలోనే..! భారత్‌ ఫ్యూచర్‌ సిటీ లక్ష్యమిదీ. 15 నిమిషాల్లో వాక్‌ టు వర్క్‌ కాన్సెప్ట్‌లో ఈ ఫోర్త్‌ సిటీని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. హైదరాబాద్‌ నగరానికి దక్షిణాన శ్రీశైలం, నాగార్జున సాగర్‌ హైవేల మధ్యలో మీర్‌ఖాన్‌పేట ప్రాంతంలో ప్రభుత్వం భారత్‌ ఫ్యూచర్‌ సిటీని నిర్మిస్తుండటం తెలిసిందే.

సుమారు 30 వేల ఎకరాల్లోని ఈ ప్రాంతంలో 15 వేల ఎకరాల రిజర్వ్‌ ఫారెస్ట్‌తో గ్రీనరీగా ఉండనుంది. మిగిలిన 15 వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీని 9 జోన్లుగా విభజించారు. నివాసాలు, డేటా సెంటర్లు, కృత్రిమ మేధస్సు (ఏఐ), విద్యా, క్రీడలు, ఎలక్రానిక్స్, లైఫ్‌ సైన్సెస్‌.. ఇలా అన్ని రంగాలకు ఫోర్త్‌ సిటీలో భూములను కేటాయించారు. ఈ మేరకు గ్లోబల్‌ సమ్మిట్‌–2025లో ఏర్పాటు చేసిన భారత్‌ ఫ్యూచర్‌ సిటీ స్టాల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఫిబ్రవరిలో ఎఫ్‌సీడీఏ ఆఫీసు ప్రారంభం..
ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) కార్యాలయం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 5 ఎకరాల్లో జీ+1 అంతస్తుల్లో నిర్మిస్తున్న ఈ భవనం వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వస్తుంది. ఎఫ్‌సీడీఏ అధికారులు, సిబ్బంది ఇక్కడి నుంచే విధులు నిర్వర్తిస్తారు.

అన్ని రకాల గృహ సముదాయాలు..
ఫ్యూచర్‌ సిటీలో నివాస సముదాయాలకు 1,300 ఎకరాలను కేటాయించారు. ఇందులో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందిన అందుబాటు గృహాలతో పాటు లగ్జరీ నివాసాలకు కూడా ఉంటాయి. ఇప్పటికే ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) ఫ్యూచర్‌ సిటీలో లేఅవుట్లు, అపార్ట్‌మెంట్లకు నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తుంది.

ఫ్యూచర్‌ సిటీలో ఏ జోన్‌కు ఎంత భూమి అంటే..
నివాస విభాగం: 1,300 ఎకరాలు
డేటా సెంటర్లు: 500 ఎకరాలు
ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫాక్చరింగ్‌: 2,000 ఎకరాలు
ఎడ్యుకేషన్‌: 500 ఎకరాలు
హెల్త్‌ సిటీ: 150 ఎకరాలు
కృత్రిమ మేధ: 300 ఎకరాలు
ఎంటర్‌టైన్‌మెంట్‌ అండ్‌ స్పోర్ట్స్‌: 900 ఎకరాలు
ఈవీ అండ్‌ బీఈఎస్‌ఎస్‌: 200 ఎకరాలు
లైఫ్‌ సైన్సెస్‌: 3,000 ఎకరాలు 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)